Vertigo Relief: తలతిరగడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనాలను దినచర్యలో చేర్చుకోండి..

వెర్టిగో అనేది ఒక ఆరోగ్య సమస్య. ఈ సమస్య ఉన్నవారు అసమతుల్యత లేదా తల తిరుగుతున్నట్లు అనిపించడం లేదా చుట్టుపక్కల వస్తువులు లేకపోయినా అవి కదులుతున్నట్లు ఉంటాయి. అంతేకాదు తల తిరుగుడుతో పాటు, వాంతులు, వికారం, వినికిడి సమస్యలు, కళ్ళు రెప్పవేయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. దీనితో పాటు కొన్ని యోగాసనాలను రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలి. ఈ యోగాసనాలు తలతిరగడం సమస్య నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది.

Vertigo Relief: తలతిరగడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనాలను దినచర్యలో చేర్చుకోండి..
Yoga Benefits

Updated on: Jun 03, 2025 | 6:41 PM

వెర్టిగో సమస్య వెన్నెముక, మెదడుకు సంబంధించినది లేదా చెవి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ (BPPV) ఉన్నా తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. అంతేకాదు సమతుల్యతను కాపాడుకోవడంలో సమస్య ఉంటుంది. ముఖ్యంగా నిద్ర నుంచి లేచి కూర్చున్నప్పుడు.. తల వంచడంలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు వెర్టిగో సమస్య నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం..

ఎవరికైనా తలతిరుగుడు సమస్య ఉంటే.. రోజువారీ దినచర్యలో బాలాసన చేర్చుకోండి. ఇది చేయడం కొంచెం కష్టం కాని .. ఒత్తిడిని తగ్గించే ఆసనం. ఈ యోగాసనం చేస్తున్నప్పుడు వెన్నెముక కూడా బాగా సాగుతుంది. ముందుగా.. వజ్రాసనంలో కూర్చుని, ఆ పై శరీరాన్ని ముందుకు వంచి.. తలను నేలపై ఉంచండి.

వజ్రాసన చేయడం వల్ల తలతిరుగుడు సమస్య కూడా తగ్గుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియతో పాటు భుజాలు, వెన్నెముకకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఈ ఆసనం శరీర భంగిమను సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో మోకాళ్లను వంచి వీపుపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నిటారుగా కూర్చోవాలి.

ఇవి కూడా చదవండి

త్రతక్ యోగా అనేది దృష్టి కేంద్రీకరణ, ధ్యానం ద్వారా మనస్సును శుద్ధి చేయడానికి, మనసులో ఉన్న సామర్థ్యాన్ని మేల్కొపడానికి సహాయపడే ఒక శక్తివంతమైన యోగా పద్ధతి. త్రతక్ యోగా చేయడం వల్ల తలతిరగడం వల్ల కలిగే ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కళ్ళకు కూడా మేలు చేస్తుంది. ఈ యోగా చేయడానికి నిశ్శబ్ద గదిని ఎంచుకోండి. లైట్లు ఆపివేసి, కొవ్వొత్తి వెలిగించి, కనీసం ఒక చేతి దూరంలో కూర్చోండి. కొవ్వొత్తి .. మీ కళ్ళు ఎత్తు సమానంగా ఉండాలి. కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చే వరకు రెప్పవేయకుండా చూస్తూ ఉండండి. తర్వాత కళ్ళు మూసుకోండి.

ప్రాణాయామం అనేది శ్వాస పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు అనులోమ విలోమం చేయవచ్చు. దీనిలో కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చుకోవాలి.. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చుకోవాలి. ఈ సమయంలో వేలితో పీల్చిన ముక్కు రంధ్రాన్ని మూసుకోవాలి. అదేవిధంగా ఎడమ ముక్కు రంధ్రంతో కూడా అదే ప్రక్రియను మళ్ళీ చేయండి.

కపాలభాతి ప్రాణాయామం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది గుండె, కాలేయం, మెదడుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కపాలభాతి చేయడం వల్ల తలతిరగడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ప్రాణాయామం చేయాలనుకుంటే నిపుణుడి పర్యవేక్షణలో చేయండి. ఎందుకంటే శ్వాస సమతుల్యతను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)