PCOS Disease: పీరియడ్స్ సకాలంలో రావడం లేదా? ఈ డైట్ ప్రయత్నించడి..

|

Sep 10, 2023 | 5:33 AM

PCOS Disease: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వ్యాధి మహిళల్లో గణనీయంగా పెరుగుతోంది. 18 నుంచి 20 ఏళ్లలోపు బాలికలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. పిసిఒఎస్ వ్యాధి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా వస్తుంది. ఈ వ్యాధి కారణంగా పీరియడ్స్ సకాలంలో రాక అండాశయాల్లో సిస్ట్‌లు ఏర్పడతాయి. ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. బరువు కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

PCOS Disease: పీరియడ్స్ సకాలంలో రావడం లేదా? ఈ డైట్ ప్రయత్నించడి..
Women Health
Follow us on

PCOS Disease: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వ్యాధి మహిళల్లో గణనీయంగా పెరుగుతోంది. 18 నుంచి 20 ఏళ్లలోపు బాలికలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. పిసిఒఎస్ వ్యాధి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా వస్తుంది. ఈ వ్యాధి కారణంగా పీరియడ్స్ సకాలంలో రాక అండాశయాల్లో సిస్ట్‌లు ఏర్పడతాయి. ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. బరువు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. మహిళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల ఇది జరుగుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే, అండాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది.

ఇటీవలి కాలంలో పీసీఓఎస్‌కు సంబంధించి ఓ కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. కీటో డైట్ తీసుకోవడం ద్వారా పిసిఒఎస్ లక్షణాలను నియంత్రించవచ్చని, ఈ వ్యాధిని నివారించవచ్చని చెబుతున్నారు. 45 రోజుల పాటు కీటో డైట్‌ని అనుసరించడం ద్వారా మహిళల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్య అదుపులోకి వస్తుందని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన అధ్యయనంలో తేలింది. దీని వల్ల PCOS వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. కీటో డైట్‌లో తక్కువ కార్బోహైడ్రేట్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు.

జర్నల్ ఆఫ్ ఎండోక్రైన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. కీటో డైట్‌ని అనుసరించడం వల్ల స్త్రీలలో సంతానోత్పత్తి కూడా మెరుగుపడుతుంది. దీనితో పాటు, హార్మోన్ల ఆటంకాలు కూడా అదుపులోకి వస్తాయి. ఇది PCOS ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

170 మంది మహిళలపై పరిశోధన..

దాదాపు 170 మంది మహిళలపై ఈ పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. వీరందరికీ కీటో డైట్‌ను ఫాలో చేయించారు. అంటే, మహిళలకు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం ఇవ్వడం జరిగింది. ఈ ఆహారం తీసుకునే మహిళల్లో సమయానికి పీరియడ్స్ రాకపోవడం అనే సమస్య చాలా వరకు తగ్గింది. అంతేకాకుండా ఊబకాయం కూడా అదుపులో ఉండేది. మహిళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి నియంత్రణలో ఉంది.

PCOS ఉన్న మహిళల్లో కీటోజెనిక్ ఆహారం, సంతానోత్పత్తి హార్మోన్ స్థాయిల మెరుగుదల మధ్య సంబంధం కనుగొనబడిందని పరిశోధన రచయిత కర్నిజా ఖలీద్ చెప్పారు. ‘కీటో డైట్ PCOS వ్యాధి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు నిరూపించాయి. ఈ డైట్‌తో బరువు అదుపులో ఉంటుంది. కీటో డైట్ కూడా శరీరంలోని జీవక్రియలను ఆరోగ్యంగా ఉంచుతుంది. హార్మోన్లు కూడా సమతుల్యంగా ఉంటాయి.’ అని కర్నిజా ఖలీద్ చెప్పుకొచ్చారు.

కీటో డైట్‌లో ఈ ఆహారాలు..

మాంసం, చేప, చీజ్, డ్రై ఫ్రూట్స్, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తింటారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాలను ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం అత్యవసరం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..