Winter Care Tips: ఈ సీజన్ లో చేతులు పొడిబారి.. దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ మీ కోసం

|

Nov 23, 2024 | 8:21 PM

శీతాకాలంలో చేతులు పొడిబారడం చాలా సాధారణం. అయితే కొన్నిసార్లు ఈ సమస్య చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల చేతుల్లో దురద, మంట, నొప్పి కూడా మొదలవుతాయి. అందువల్ల, శీతాకాలంలో మీ చేతులు చాలా పొడిగా ఉంటే ఈ సమస్యను నివారణకు, ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటించి చూడండి

Winter Care Tips: ఈ సీజన్ లో చేతులు పొడిబారి.. దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ మీ కోసం
Winter Skin Care Tips
Follow us on

చలికాలంలో చల్లటి గాలులు వేస్తాయి. గాలిలో తేమ వల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం చేతులపై ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖానికి చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ కాళ్ళు, చేతుల విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోరు. అయితే రోజుకు ఒకసారి మాయిశ్చరైజర్ రాసుకున్నా.. శీతాకాలంలో ఆ చర్య సరిపోదు.

చలికాలంలో చల్లని గాలి, హీటర్ వాడటం, వేడి నీళ్లతో చేతులు కడుక్కోవడం వల్ల చేతులు పొడిబారతాయి. దీంతో చేతుల చర్మం పొడిగా మారాతాయి. ఒకొక్కసారి చేతులకు పగుళ్లు కూడా ఏర్పడతాయి. గరుకుగా మారతాయి. ఈ సమస్య తీవ్రమైతే చేతుల్లో మంట, దురద, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల శీతాకాలంలో ఎవరి చేతులైనా పొడిగా మారినట్లయితే వాటి సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మాయిశ్చరైజ్ అప్లై చేయండి

చలికాలంలో చాలా మంది మాయిశ్చరైజర్‌ని వాడతారు. అయితే మాయిశ్చరైజర్‌ను ముఖంతో పాటు చేతులు, పాదాలకు క్రమం తప్పకుండా వాడాలి. చేతులు చాలా పొడిగా ఉంటే ఉదయం చేతులకు మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. రోజులో 3 నుండి 4 సార్లు మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు, వంటగదిలో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత లేదా పాత్రలు లేదా బట్టలు ఉతికిన తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.

ఇవి కూడా చదవండి

నూనెను ఉపయోగించండి

ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్ వంటి సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల చేతుల్లో తేమను కాపాడడంలో మంచి సహాయకారిగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకునే ముందు వీటిలో ఏదైనా నూనె రాసి చేతులకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన చేతుల చర్మంలో తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది.

సల్ఫేట్ లేని హ్యాండ్ వాష్

చలికాలంలో చేతులు చాలా పొడిగా, పగుళ్లుగా ఉంటే, సల్ఫేట్ లేని హ్యాండ్ వాష్ లేదా సబ్బును ఉపయోగించడానికి ప్రయత్నించండి. తేలికపాటి హ్యాండ్ వాష్ లేదా సబ్బును ఉపయోగించాలి. అలాగే, చేతులు కడుక్కోవడానికి చల్లని లేదా వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి

విపరీతమైన చలిలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతులకు గ్లోవ్స్ ను తప్పనిసరిగా ధరించండి. అంటే వెచ్చ దనం ఇచ్చే శీతాకాలపు హ్యాండ్స్ గ్లోవ్స్ ను ధరించాలి. ఇవి చల్లని గాలి నుంచి చర్మాన్ని కాపాడతాయి. గోరు వెచ్చని నీటితో చేతులు కడుక్కున్న తర్వాత.. చేతులను టవల్‌తో గట్టిగా రుద్దకండి.. టవల్‌తో తేలికగా అంటే సున్నితంగా తుడవండి. తద్వారా చర్మం తేమగా ఉంటుంది. అయితే ఈ చేతుల సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి