
మల్బెర్రీ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవ్వడానికి ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మల్బెర్రీ పండ్లలో విటమిన్లు కె, ఇ సైతం అధికంగా ఉంటాయి. విటమిన్ కె వల్ల గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకడుతుంది.
విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. ఈ పండు తినడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది. మెటబాలిజం పెంచే ఈ పండు..బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. పరిమితంగా రోజూ తింటే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. మల్బెర్రీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. చర్మం సురక్షితంగా ఉండేలా చూస్తుంది.
మల్బెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.. గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలను దరి చేరకుండా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..