Rapid Weight Gain: ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..

ఆచితూచి తిన్నాసరే చాలా మంది బరువు మాత్రం ఏమాత్రం తగ్గరు. పైగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు సాధారణంగా వారి ఆహారంపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారు. కానీ వారి బరువు నియంత్రణలో ఉండదు. మీకూ ఇలాంటి సమస్య ఉంటే దానిని అంత తేలికగా తీసుకోకండి..

Rapid Weight Gain: ఆచితూచి తిన్నా బరువు పెరుగుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..
Common Causes Of Rapid Weight Gain

Updated on: Feb 09, 2026 | 1:17 PM

లావుగా అవుతామనే భయంతో తక్కువ తినే వారిని మీరు చూసే ఉంటారు. అంత ఆచితూచి తిన్నాసరే వారి బరువు మాత్రం ఏమాత్రం తగ్గదు. పైగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు సాధారణంగా వారి ఆహారంపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారు. కానీ వారి బరువు నియంత్రణలో ఉండదు. మీకూ ఇలాంటి సమస్య ఉంటే దానిని అంత తేలికగా తీసుకోకండి. ఇది శరీరంలోని కొన్ని వ్యాధుల లక్షణం కావచ్చు. అంతే కాదు ఇది జీవక్రియకు నేరుగా సంబంధించినది కావచ్చు. కాబట్టి దీనికి అసలు కారణం ఏమిటో, ఈ సమస్య ఎందుకు వస్తుందో, దానిని నివారించడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

రాజీవ్ గాంధీ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ ఏం చెబుతున్నారంటే.. తక్కువ ఆహారం తీసుకున్న తర్వాత కూడా బరువు పెరగడం చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. ఇది 40 ఏళ్ల తర్వాత ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం జీవక్రియ నెమ్మదిగా జరగడం. దీంతో శరీరం కేలరీలు బర్న్ చేయడానికి పట్టే సమయం చాలా నెమ్మదిస్తుంది. అందుకే తక్కువ తిన్న తర్వాత కూడా శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి ఏమి తిన్నా, శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఊబకాయం, బరువు పెరగడానికి దారితీస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత

ఆహారం తీసుకోవడం తగ్గించినప్పటికీ బరువు పెరగడానికి మరో ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. ఇటువంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా PCOS, రుతువిరతి, గర్భం తర్వాత సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరగవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఈ సమస్యలు సర్వసాధారణం అవుతాయి. వయస్సు పెరిగే కొద్దీ బరువు కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సరైన ఆహారం ఎలా తినాలో తెలియకపోవడం

సాధారణంగా కొంతమంది ఆహారం సరిగ్గా తీసుకోరు. అంటే వారు అవసరమైన దానికంటే తక్కువ తింటారు లేదా ఎక్కువసేపు ఆకలితో ఉంటారు. అలాంటి సందర్భాలలో శరీరం కొవ్వును కాల్చదు. దీంతో దానిని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ రకమైన అలవాట్లు బరువు పెరగడానికి దారితీస్తాయి. అలాగే, స్టెరాయిడ్ మందులు తీసుకునే వారిలో ఈ రకమైన సమస్య కనిపిస్తుంది.

బరువు పెరగకుండా నిరోధించడానికి చిట్కాలు

  • సమతుల్య ఆహారం తీసుకోవడం.
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
  • 7-8 గంటలు నిద్రపోవడం మర్చిపోకూడదు.
  • మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.