చనిపోయినట్లు కల వస్తే ఏం జరుగుతుంది.. స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..?

చాలా మందికి రకరకాల కలలు వస్తాయి. కొందరికి గుర్తుంటాయి. మరికొందరికి మాత్రం అస్సలు గుర్తుండవు. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతీ కలకు ఓ ప్రత్యేక కారణం ఉంటుంది. ఈ కలలు భవిష్యత్తు సంఘటనలను సూచిస్తూ, మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. మరణం లేదా ప్రమాదం గురించి కల వస్తే ఏం జరుగుతుంది..? అనేది తెలుసుకుందాం..

చనిపోయినట్లు కల వస్తే ఏం జరుగుతుంది.. స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..?
Dreaming About Death

Updated on: Dec 04, 2025 | 8:56 PM

కలలు.. ప్రతి వ్యక్తికీ వచ్చే సహజమైన అనుభవం. పగటిపూట మనం చూసే లేదా ఆలోచించే విషయాలే కలలుగా వస్తాయని కొందరు నమ్ముతారు. మరికొందరు మనం అనుభవిస్తున్న పరిస్థితులు, భావోద్వేగాలు కలల రూపంలో చిత్రాలుగా కనిపిస్తాయని భావిస్తారు. సాధారణంగా కలలను రెండు రకాలుగా చెబుతారు. ఒకటి, మనం భవిష్యత్తు గురించి కళ్లు తెరిచి కనే కలలు, రెండు, రాత్రి నిద్రలో వచ్చే కలలు. ఈ నమ్మకాలకు భిన్నంగా హిందూ కలల శాస్త్రం.. కలలను ఒక ప్రత్యేక కోణంలో చూస్తుంది. కలల శాస్త్రం ప్రకారం.. మనం చూసే కలలు మన జీవితాలపై వివిధ ప్రభావాలను చూపుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. మరి ఎవరైనా తమ మరణం లేదా ఏదైనా ప్రమాదం గురించి పదేపదే కలలు కంటుంటే అది ప్రమాదానికి సూచననా లేదా మరేదైనా శుభసూచకమా? అనేది తెలుసుకుందాం..

మీ మరణం గురించి కల వస్తే అర్థం ఏమిటి?

స్వప్న శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి కలలో తాను చనిపోయినట్లు పదే పదే చూస్తే, అది భయపడాల్సిన విషయం కాదు. దీనికి భిన్నంగా ఈ కల మంచి ఫలితాన్ని సూచిస్తుంది. మీ కలలలో మీరు చనిపోయినట్లు చూస్తే, రాబోయే సంక్షోభం లేదా మరణ ముప్పు అప్పటికే దాటిపోయిందని లేదా తప్పిపోయిందని అర్థం. కాబట్టి మీ సొంత మరణం గురించి కలలు కన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.

ప్రమాదంలో ఉన్నట్లు కలలు వస్తే అర్థం ఏమిటి?

ఒకవేళ మీరు మీ కలలో ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నట్లు చూసినట్లయితే.. స్వప్న శాస్త్రం దీనిని భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. భవిష్యత్తులో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని దాన్ని అర్థం. ఈ కల మిమ్మల్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండమని సూచిస్తుంది. ఈ కలలను కేవలం ఒక సూచనగా మాత్రమే పరిగణించాలని, అప్రమత్తతతో ఉండటం ద్వారా రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి