Ceiling Fans Dust: ఫ్యాన్‌ తిరిగేటప్పుడు దానిపై ఉండే దుమ్ము ఎందుకు కింద పడదు? ఈ డౌట్‌ మీకూ వచ్చిందా

Updated on: May 01, 2026 | 1:08 PM

వేసవిలో ప్రతి ఇంట్లో ఫ్యాన్లు పగలు రాత్రి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అవి నిరంతరం గాలిని కదిలిస్తున్నప్పటికీ కొన్ని రోజుల్లోనే వాటి రెక్కల అంచులపై నల్లటి దుమ్ము మందపాటి పొరలా పేరుకుపోతుంది. కానీ అంత వేగంగా తిరిగే ఫ్యాన్ రెక్కలపై అసలు ఈ దుమ్ము ఎక్కడి నుండి వస్తుంది? ఫ్యాన్‌ తిరిగేటప్పుడు ఫ్యాన్‌ రెక్కలపై ఉండే దుమ్ము ఎందుకని కింద పడదు?

1 / 5
ఫ్యాన్ గాలిలో తిరుగుతున్నప్పుడు దాని రెక్కలు గాలికి రాపిడికి గురవుతాయి. దీనివల్ల రెక్కలపై ఒక రకమైన విద్యుత్ ప్రవాహం (స్థిర విద్యుత్ ఆవేశం) ఏర్పడుతుంది. ఈ ఆవేశం కారణంగా గాలిలో కదులుతున్న దుమ్ము రెక్కల వైపు ఆకర్షించబడుతుంది. అది అయస్కాంతంలా రెక్కల అంచులకు అంటుకుంటుంది.

2 / 5
ఫ్యాన్ దగ్గర గాలి ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ ప్రకారం రెక్కలకు సరిగ్గా పక్కన ఉండే గాలి పొర చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ పొరలో గాలి ఎక్కువగా కదలదు. కాబట్టి సన్నని ధూళి కణాలు అక్కడ సులభంగా పేరుకుపోతాయి. అందువల్ల ఫ్యాన్ ఎంత వేగంగా తిరిగినా ఈ పొరలోని ధూళి బయటకు ఎగిరిపోదు.

3 / 5
గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వల్ల దుమ్ము కొంచెం జిగటగా మారుతుంది. ఈ జిగట దుమ్ము ఒకసారి రెక్కలపై పడితే, ఫ్యాన్ వేగంగా తిరిగినా కూడా అది తొలగిపోదు. బదులుగా వాటిపై మరింత దుమ్ము పొరలు పేరుకుపోతాయి.

4 / 5
బ్లేడ్లపై దుమ్ము పేరుకుపోయినప్పుడు ఫ్యాన్ బరువుగా మారి, గాలి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఫ్యాన్ పూర్తి వేగంతో తిరుగుతున్నప్పటికీ, మనకు కావలసినంత గాలి రాదు. అందువల్ల ఫ్యాన్‌ను అప్పుడప్పుడు తుడవడం మంచిది.

5 / 5
కాబట్టి ఈ వేసవిలో ఫ్యాన్ వేగంపైనే కాకుండా దాని శుభ్రతపై కూడా శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీకు స్వచ్ఛమైన, పుష్కలంగా చల్లని గాలి లభిస్తుంది.

Follow Us