Dairy milk vs plant based milk: పాలల్లో బెస్ట్ ఏది? ఆవు పాలకు ప్రత్యామ్నాయం ఉందా? ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్..

|

Feb 06, 2023 | 1:08 PM

అసలు డెయిరీ పాలలో ఉండే పోషకాలు ఏంటి? మొక్కల ఆధారిత బాదం, సోయా, బియ్యం, కొబ్బరి వంటి పాలలో లభించే పోషకాలు ఏంటి? వీటిల్లో ఏది బెస్ట్? ఎవరికి బెస్ట్ ఓసారి చూద్దాం..

Dairy milk vs plant based milk: పాలల్లో బెస్ట్ ఏది? ఆవు పాలకు ప్రత్యామ్నాయం ఉందా? ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్..
PCOS
Follow us on

పాలకు ప్రత్యామ్నాయం.. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండింగ్ ఇదే. ఆవు, గేదె పాలకు ప్రత్యామ్నాయంగా బాదం పాలు, సోయా పాలు, వోట్స్ పాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇంట్లోనే ఉండి ఈ పాలను తయారు చేసుకునే విధానాల కోసం యూట్యూబ్ లో సెర్చింగ్ లు పెరిగిపోతున్నాయి. అయితే ఇవి సంప్రదాయ ఆవు పాలకన్నా శ్రేష్టమైనవా? ఆవు పాల కన్నా మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. సోయా, బాదం, వోట్స్ వంటి వాటి కన్నా ఏ రకంగా చూసినా ఆవు పాలే మేలని సూచిస్తున్నారు. అయితే ఆవు పాలకు శరీరం అడ్జస్ట్ అవ్వగలగాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు డెయిరీ పాలలో ఉండే పోషకాలు ఏంటి? మొక్కల ఆధారిత బాదం, సోయా, బియ్యం, కొబ్బరి వంటి పాలలో లభించే పోషకాలు ఏంటి? వీటిల్లో ఏది బెస్ట్? ఎవరికి బెస్ట్ ఓసారి చూద్దాం..

ఏ పాలలో ఎన్ని కేలరీలు..

అన్ని రకాల పాలకు ప్రామాణికంగా 100 ఎంఎల్ తీసుకుంటే, పూర్తి క్రీమ్ ఆవు పాలలో 100 నుంచి 120 కేలరీలు లభిస్తాయి. అలాగే నాలుగు నుంచి ఐదు గ్రాముల ప్రోటీన్, ఐదు నుండి ఆరు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే బాదం పాలలో అయితే 40 కేలరీలు, రెండు గ్రాముల ప్రోటీన్, మూడు గ్రాముల కొవ్వును లభిస్తాయి. సోయా పాలు దాదాపు 80 కేలరీలు, 3.5 గ్రాముల ప్రోటీన్లు, 4 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది. బియ్యం పాలలో 120 కేలరీలు, ప్రోటీన్లు ఉండవు, రెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. కొబ్బరి పాలలో దాదాపు 50 నుంచి 60 కేలరీలు ఉంటాయి, 0 నుండి 0.5 గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల కొవ్వు ఉంటుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే మొక్కల ఆధారిత పాలతో పోల్చితే డెయిరీ పాలలో పోషకాలు అధికంగా ఉంటాయని స్పష్టమవుతుంది.

మొక్క ఆధారిత పాలలో..

వీటల్లో సాధారణంగా సంతృప్త కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే డెయిరీ పాలు పడని వారు, లాక్టోస్ అసహనం ఉన్నవారు, శాకాహారులకు ఇవి బెస్ట్ ఆప్షన్స్. బాదం, సోయా, బియ్యం, కొబ్బరి, వోట్స్ మొదలైన వాటి రూపంలో ఇప్పుడు మార్కెట్‌లో మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ ఫ్లమేషన్ తో బాధపడేవారు, కడుపు నొప్పితో బాధపడేవారు, పేగు సంబంధిత వ్యాధులు ఉన్నవారు, లాక్టోస్‌ను జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్న వారికి ఇవి మంచి ఎంపికలను నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా విటమిన్ డీ కూడా అందుతుంది.

ఇవి కూడా చదవండి

డెయిరీ పాలలో..

ఆవు పాలు శరీరానికి అవసరమైన అనేక రకాల ప్రోటీన్‌లను అందిస్తుంది. అవసరమైన అమైనో ఆమ్లాల పూర్తి ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఇది కొవ్వుల నుంచి అదనపు కేలరీలను అందిస్తుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మీరు ఎంచుకున్న రకంతో సంబంధం లేకుండా, డెయిరీ మిల్క్‌లో తొమ్మిది ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి: కాల్షియం, విటమిన్ D, పొటాషియం, ఫాస్పరస్, ప్రోటీన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ B12, విటమిన్ A, పాంతోతేనిక్ యాసిడ్. ముఖ్యంగా కాల్షియం తక్కువగా ఉన్నవారు రోజూ పాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..