Chapati Tips: రోజంతా మెత్తగా ఉండే చపాతీలు.. పొరలు పొరలుగా రావాలా.. ఇవే టిప్స్

సాధారణంగా ఉదయం చేసిన చపాతీలు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి గట్టిగా, రబ్బరులా మారిపోతుంటాయి. ఎంత జాగ్రత్తగా పిండి కలిపినా, కాల్చినా ఈ సమస్య ఎదురవుతుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఉదయం చేసిన చపాతీలు కూడా రోజంతా మెత్తగా, తాజాగా ఉంటాయి. చపాతీ మెత్తదనం పిండి కలపడం దగ్గరే మొదలవుతుంది. ఆ టిప్స్ ఏంటో మీరూ చూసేయండి..

Chapati Tips: రోజంతా మెత్తగా ఉండే చపాతీలు.. పొరలు పొరలుగా రావాలా.. ఇవే టిప్స్
అయితే నేటి గోధుమలు చాలావరకు జన్యుపరంగా మార్పు చేయబడ్డాయి. దీని వలన దానిలోని గ్లూటెన్ జీర్ణం కావడం కష్టమవుతుంది. అందుకే మీ ఆహారంలో గోధుమలను తొలగిస్తే జీర్ణవ్యవస్థకు గొప్ప ఉపశమనం లభిస్తుంది.

Updated on: Sep 07, 2025 | 9:34 PM

చపాతీ పిండి మెత్తగా ఉండాలంటే నీటికి బదులుగా పాలు కలపండి. పాలలో ఉండే ప్రోటీన్లు తేమను నిలుపుకుంటాయి. ఇది చపాతీలను మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. పిండిలో ఒక చెంచా నూనె లేదా నెయ్యి కలపాలి. దీనివల్ల పిండిలో ఉండే గ్లూటెన్ పొడిబారకుండా ఉంటుంది. పిండి కలిపేటప్పుడు గోరువెచ్చని నీటిని వాడితే ఫలితం బాగుంటుంది.

పిండిని కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత తడి వస్త్రంతో కప్పి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండిలో తేమ బాగా పీల్చుకుంటుంది. చపాతీలు మరింత మెత్తగా వస్తాయి. చపాతీలు కాల్చే విధానం కూడా వాటి మెత్తదనానికి చాలా కీలకం.

పెనం బాగా వేడి చేయండి: పెనం సరిగ్గా వేడెక్కిన తర్వాతే చపాతీలు వేయాలి. వేడిగా ఉన్న పెనం మీద చపాతీ వేసినప్పుడు ఆవిరి పుట్టి, చపాతీ పొరలు మెత్తగా ఉంటాయి.

సరైన సమయం: చపాతీని తక్కువ సమయం కాల్చినా, లేదా ఎక్కువ సమయం కాల్చినా గట్టిగా అవుతుంది. అవి ఉబ్బినప్పుడు తిరగేయాలి. రెండు వైపులా గోధుమ రంగు మచ్చలు కనిపించిన తర్వాత తీసేయాలి.

సరిగ్గా నిల్వ చేయండి

శుభ్రమైన వస్త్రంలో చుట్టాలి: చపాతీలు కాల్చిన తర్వాత, వాటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంలో లేదా పేపర్ టవల్‌లో చుట్టాలి. ఇది అదనపు ఆవిరిని పీల్చుకుంటుంది.

గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి: వస్త్రంలో చుట్టిన చపాతీలను గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి. ఇలా చేస్తే చపాతీల్లో తేమ సరిగ్గా ఉంటుంది. గంటల తరబడి అవి మెత్తగా ఉంటాయి. ప్రయాణాల్లో తీసుకెళ్లాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టడం మంచిది. ఇది చపాతీలను తాజాగా, మెత్తగా ఉంచుతుంది.