
యాలకుల టీ తాగిన తర్వాత నోట్లో మంచి శుభ్రత అనిపిస్తుంది. ఇది నోటి నుంచి వచ్చే చెడు వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతుంది. శ్వాసలో తియ్యటి పరిమళం ఉండడానికి ఇది సహకరిస్తుంది. రోజూ ఈ టీ తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. తిన్న తర్వాత తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది.
యాలకుల టీలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల కణాల మీద వచ్చే నష్టం తగ్గుతుంది. దీర్ఘకాలిక రోగాలు దూరంగా ఉంటాయి.
బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే యాలకుల టీ మంచి స్నేహితుడు. ఇది శరీరంలో కొవ్వు పదార్థాలను కరిగించడానికి సహాయం చేస్తుంది. మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచే సహజమైన మార్గాల్లో ఇది ఒకటి.
ఈ టీలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది హై బీపీ ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుంది. రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
యాలకులు సహజంగా యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే ఫ్లూ, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి వస్తుంది.
ఈ టీ తాగిన తర్వాత శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటికి పంపబడతాయి. ఇది కాలేయానికి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. శుద్ధి చేసే ప్రక్రియ వేగవంతమవుతుంది.
ఈ టీ తాగిన తర్వాత మనసు ప్రశాంతంగా మారుతుంది. పెద్దగా ఊపిరి తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఒత్తిడికి గురవుతున్న వారిలో యాలకుల టీ ఉపశమనం కలిగిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడి మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది.
ఒక కప్పు నీటిలో రెండు దంచిన యాలకులను వేసి మరిగించి, కావాలంటే తేనె కలిపి తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఇది తీసుకుంటే మంచి ఫలితాలు కనిపించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)