AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇనాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై వర్షాకాలంలో చికెన్, మటన్ తినే ముందు ఇది పక్కా తెలుసుకోండి!

చికెన్, మటన్.. ఈ రెండు పేర్లు వినగానే నాన్‌వెజ్ లవర్స్‌కు నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని తహతహలాడిపోతారు. వారంలో ఒక్కసారైనా వీటిని తినకుండా అస్సలు ఉండలేరు. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అయినప్పటికీ.. వర్షాకాలంలో కొందరు మాత్రం వీటి జోలికి వెళ్లవద్దని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో చికెన్, మటన్ ఎవరు తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఇనాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై వర్షాకాలంలో చికెన్, మటన్ తినే ముందు ఇది పక్కా తెలుసుకోండి!
Who Should Avoid Chicken And Mutton In Monsoon
Anand T
|

Updated on: Aug 03, 2026 | 4:57 PM

Share

నాన్‌వెజ్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది.. చికెన్, మటన్. చాలా మంది నాన్‌వెజ్ అవర్స్‌కు ఇవి లేకుండా భోజనం అసంపూర్తిగానే ఉంటుంది. సండే వచ్చిందంటే కచ్చితంగా రెండింటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే. టేస్ట్‌తో పాటు వీటిలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చాలామంది వీటిని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తుంటారు.అయితే సీజన్‌ను బట్టి కొందరు వీటికి దూరంగా ఉంటారు. కొందరు వేసవిలో చికెన్‌ తినకూడదని అనుకుంటారు. మరికొందరు మటన్‌కు దూరంగా ఉంటారు.

అయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది కాబట్టి.. ఈ రెయినీ సీజన్‌లో ఎవరు చికెన్, మటన్ తినాలి, ఎవరూ తినకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలంలో ఇవి అందరిపై ఒకేలాంటి ప్రభావం చూపకపోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వర్షాకాలంలో ఈ చికెన్, మటన్ జోలికి వెళ్లకపోవడమే బెస్ట్ అని చెబుతున్నారు.కాబట్టి వర్షాకాలంలో చికెన్, మటన్ ఎవరు తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చూద్దాం.

వర్షాకాలంలో చికెన్: ఎవరు తినకూడదు? ఎందుకు?

చికెన్‌లో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని సమస్యలు శరీరంలో అధిక వేడి, పిత్త సమస్యలు ఉన్నవారు చికెన్ తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చికెన్ జీర్ణమయ్యేటప్పుడు శరీరంలో వేడి ఉత్పత్తయ్యే ప్రక్రియ జరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కాబట్టి వేడి శరీరం లేదా పిత్త సంబంధిత సమస్యలు ఉన్నవారు వర్షాకాలంలో చికెన్‌ను పరిమితంగా తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్, ఫ్యాట్ సమస్యలు ఉన్నవారు కూడా చికెన్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

మటన్ ఎవరు దూరంగా ఉండాలి?

మటన్‌లోనూ మన శరీరానికి కావాల్సిన ఐరన్, జింక్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచినప్పటికీ చికెన్ కంటే ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మటన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మటన్‌లో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ను పెంచి, ధమనులను బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి గుండెజబ్బులు ఉన్నవారు మటన్‌ను చాలా తక్కువగా తినాలి లేదా దూరంగా ఉండాలి.

వర్షాకాలంలో నాన్‌వెజ్ తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. కాబట్టి చికెన్ లేదా మటన్ వంటి ఆహారాలు తిన్నం వెంటనే జీర్ణం అవ్వవు.. అవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు మితంగా మాత్రమే నాన్‌వెజ్ తీసుకోవాలి. అలాగే వర్షాకాలంలో నిల్వ ఉంచిన లేదా బయట ఎక్కువ సేపు ఉన్న మాంసాన్ని తింటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండే మాంసాన్నే ఎంచుకోండి. అలాగే సగం ఉడికిన మాంసాన్ని అస్సలు తినకండి. పూర్తిగా ఉడికినది మాత్రమే తినండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..
రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..
శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం..
శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం..
చిరుజల్లుల్లో తినడానికి బెస్ట్ స్నాక్.. కారం కారంగా కార్న్...
చిరుజల్లుల్లో తినడానికి బెస్ట్ స్నాక్.. కారం కారంగా కార్న్...
పచ్చి కొబ్బరి తినే అలావాటు మీకుందా..? అయితే, ఇది మీ కోసమే..!
పచ్చి కొబ్బరి తినే అలావాటు మీకుందా..? అయితే, ఇది మీ కోసమే..!
చక్కెర లేకుండా మఖానా కీర్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలంటే?
చక్కెర లేకుండా మఖానా కీర్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలంటే?
ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డును అస్సలు వాడొద్దు.. మీకు తప్పక..
ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డును అస్సలు వాడొద్దు.. మీకు తప్పక..
ఇంత బాధను భరించలేక.. వణుకుతన్న చేతులతో సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం
ఇంత బాధను భరించలేక.. వణుకుతన్న చేతులతో సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం
స్టార్ కామెంటేటర్‌‌పై జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు
స్టార్ కామెంటేటర్‌‌పై జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు
అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం.. రూ.1 లక్ష జరిమానా.. అసలేం జరిగిందంటే
అమెజాన్‌లో అయోధ్య ప్రసాదం.. రూ.1 లక్ష జరిమానా.. అసలేం జరిగిందంటే
పిల్లలు లేని దంపతులు మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుంది?
పిల్లలు లేని దంపతులు మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుంది?