Winter Foods: చలికాలంలో తప్పక తినాల్సిన ఆహారం ఏంటో తెలుసా..? యాక్టివ్‍నెస్ పెంచేవి ఇవి..

చలికాలంలో ఉదయం సూర్యుడి రాక కాస్త ఆలస్యమవుతుంది. పగటి కాలం తగ్గుతుంది. వాతావరణం చల్లగా మారిపోతోంది..చలితీవ్రత అధికంగా ఉంటుంది. ఈ కారణాలతో చలికాలంలో శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది..యాక్టివ్‍నెస్ బాగా తగ్గుతుంది. ఉదయాన్నే శరీరం బద్దకంగా అనిపిస్తుంది. అయితే, కాలంతో పాటు వచ్చే ఈ సవాళ్లను పోషకాలు ఉండే ఆహారంతో ఎదుర్కోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు తప్పక తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. అలా చలికాలంలో తప్పక తినాల్సిన ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి...

Winter Foods: చలికాలంలో తప్పక తినాల్సిన ఆహారం ఏంటో తెలుసా..? యాక్టివ్‍నెస్ పెంచేవి ఇవి..
Winter Foods
Follow us
P Shivteja

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 20, 2024 | 10:54 AM

వింటర్ సీజన్ మొదలైంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి..చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది..చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది..వీటి వల్ల శరీరమంతా నీరసంగా మారుతుంది..అందుకే చలికాలంలో వెచ్చగా ఉండటం కూడా ముఖ్యం.. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించాలి. చలికాలంలో వాతావరణ ప్రభావంతో శరీరం అంత చురుగ్గా ఉండదు. బద్ధకంగా అనిపిస్తుంది. అయితే, కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల శీతాకాలంలో యాక్టివ్‍నెస్ పెరుగుతుందని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. వీటితో మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది..

ఆకుకూరలు..

ఫీల్‍గుడ్ న్యూట్రోట్రాన్స్‌మిటర్ ‘సెరోటిన్’ ఉత్పత్తిని శరీరంలో ఫోలెట్, విటమిన్ బీ పెంచగలవు. పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల శరీరం బద్ధకం అనిపించడం తగ్గుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడి ప్రభావాన్ని ఇవి తగ్గించగలవు.

సిట్రస్ పండ్లు..

నారింజ, చీనీ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి వ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు విటమిన్ సీ ఎంతగానో తోడ్పడుతుంది. సిట్రస్ పండ్లలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని ఇవి రక్షిస్తాయి. జీర్ణాన్ని కూడా మెరుగుపరుస్తాయి..

ఒమేగా-3 యాసిడ్స్ కోసం ఫ్యాటీ చేపలు..

సాల్మన్, మాకెరెల్, సార్డినెస్ లాంటి ఫ్యాటీ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును చురుగ్గా మారుస్తాయి. మూడ్‍ను చురుగ్గా చేస్తాయి. ఆందోళన, డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలను ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిస్తాయి. ఈ చేపలను వారంలో మూడుసార్లు తీసుకుంటే ఇమ్యూనిట్ పవర్ పెరుగుతుంది..పులియబెట్టిన ఫుడ్స్ పెరుగు,యగర్ట్, కెఫిర్, కిమ్చి లాంటి పులియబెట్టిన ఆహారాలు..పేగుల్లో ఆరోగ్యకరమైన మెక్రో బయోమ్‍లను మెరుగు పరుస్తాయి..ఈ ప్రోబయోటిక్ ఫుడ్స్ తినడం వల్ల కడుపు మెరుగ్గా ఉండి శరీరం బరువుగా ఫీల్ అవదు. చురుకైన మూడ్ ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మెరుగుపరుస్తాయి..

నట్స్, సీడ్స్ నుంచి మెగ్నిషియం..

వాల్‍నట్స్, బాదం, గుమ్మడి గింజలు లాంటి నట్స్, సీడ్స్‌లో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. శరీరంలో ఒత్తిడిని, ఆందోళన తగ్గేందుకు ఇది తోడ్పడుతుంది. శరీరంలో తేలిగ్గా ఉండేలా, రిలాక్స్ అయినట్టుగా ఉండేలా మెగ్నిషియం చేయగలదు. చలికాలంలో బద్ధకం ఫీలింగ్ పోవాలంటే ఇవి చాలా ముఖ్యం. స్నాక్స్‌గా నట్స్, సీడ్స్ తీసుకుంటే మూడ్ చాలా మెరుగవుతుంది..

దుంప కూరగాయల్లో..

బీట్‍రూట్, క్యారెట్లు, బంగాళదుంపలు లాంటి దుంప కూరగాయయల్లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని బాగా అందిస్తాయి. రోజంతా శరీరం నిస్సారం కాకుండా చేయగలవు. ఇవి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. పోషకాలను కూడా శరీరానికి బాగా అందిస్తాయి….

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చలికాలంలో తప్పక తినాల్సినఆహారం ఏంటో తెలుసా..?యాక్టివ్‍నెస్ పెంచవి
చలికాలంలో తప్పక తినాల్సినఆహారం ఏంటో తెలుసా..?యాక్టివ్‍నెస్ పెంచవి
ఛాన్స్ వస్తే దర్శకత్వం మానేసి ఆ పని చేస్తా.. ప్రశాంత్ వర్మ..
ఛాన్స్ వస్తే దర్శకత్వం మానేసి ఆ పని చేస్తా.. ప్రశాంత్ వర్మ..
ఇంత టాలెంటెడ్ ఉన్నావ్..​ పోలీస్​ బాడీ కెమెరా కొట్టేసిన కేటుగాడు
ఇంత టాలెంటెడ్ ఉన్నావ్..​ పోలీస్​ బాడీ కెమెరా కొట్టేసిన కేటుగాడు
రూ.3500 వేల కోట్లను మామ కొట్టేశాడు.. కట్ చేస్తే..
రూ.3500 వేల కోట్లను మామ కొట్టేశాడు.. కట్ చేస్తే..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..
అనుష్క శెట్టి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ?
అనుష్క శెట్టి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ?
జొమాటో, స్విగీలో ఈ ఫీచర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారంతే..
జొమాటో, స్విగీలో ఈ ఫీచర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారంతే..
పొలిమేర దాటని కథలు.. గ్రామీణ నేపథ్యంపై ఫోకస్ పెట్టిన హీరోలు..
పొలిమేర దాటని కథలు.. గ్రామీణ నేపథ్యంపై ఫోకస్ పెట్టిన హీరోలు..
దేశ చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ...35 వేల మందితో 9రోజుల పాటు..
దేశ చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ...35 వేల మందితో 9రోజుల పాటు..
భారత్‌పై నోరు జారితే తాటతీస్తాం..: పీసీబీకి ఐసీసీ వార్నింగ్
భారత్‌పై నోరు జారితే తాటతీస్తాం..: పీసీబీకి ఐసీసీ వార్నింగ్
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!