ప్రేమికుల రోజు.. వాలెంటైన్స్ డే గురించి అందరికీ తెలుసు. వాలెంటైన్స్ వీక్‌లో వారం రోజుల పాటు తమ ప్రియమైన వారికి వివిధ రూపాలలో ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. చాలా మంది తమ ప్రేమను మరింత బలపరుచుకోడానికి, అవతలి వ్యక్తికి తన ప్రేమను చాటి చెప్పడానికి ఈ వాలెంటైన్స్ డేని వినియోగించుకుంటారు. అయితే వాలెంటైన్స్ వీక్ లాగే యాంటీ వాలెంటైన్స్ వీక్ ఒకటి ఉందని మీకు తెలుసా? నిజం అండి ఇది బ్రేకప్ చెప్పుకున్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి వాలెంటైన్స్ డే అయిపోయిన మరుసటి రోజు నుంచే ఫిబ్రవరి15 నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా ఒక వారం ఉంటుంది. ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది కదూ.. అయితే ఇది ప్రేమికులకు వ్యతిరేకంగా ఉద్దేశించింది అయితే కాదు.. కానీ బ్రేకప్ అంటూ విడిపోయిన వాళ్లు సరదాగా గడపడానికి తిరిగి తమ జీవితాన్ని ప్రారంభించేందుకు ఉపకరిస్తుంది. అందులో ఫిబ్రవరి 18 ఫ్లర్టింగ్ డే. ఒకవేళ మీకు ఎవరి మీద అయినా.. క్రష్ ఉన్నట్టు అయితే.. ఫ్లర్టింగ్ డే రోజున మాట్లాడి.. మీ లక్ పరీక్షించుకోవచ్చు. వారితో మంచి సమయం గడిపేందుకు ట్రై చేయవచ్చు.
ఫ్లర్టింగ్(Flirting) అనే పదం ఫ్రెంచ్ పదం ‘ఫ్లూరెట్’ నుంచి ఉద్భవించింది. దీని అర్థం పూల రేకులను వదలడం ద్వారా ఒకరిని మోహింపజేయడం. ఇది మొదట 16వ శతాబ్దపు పద్యాలలో ఉపయోగించబడింది. మీకు ఎవరిపైనైనా ప్రేమ ఉంటే, వారికి తెలియజేయడానికి ఫ్లర్టింగ్ డే ఉత్తమ సమయం. అయితే ఓ పరిధిలోనే ఉండాలి. అతిగా చేస్తే బంధం శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది.
ఫ్లర్టింగ్ డేన మీ స్నేహితులందరితో పాటు మీ స్పెషల్ పర్సన్‌ని పార్టీకి ఆహ్వానించండి. పార్టీ మొదలైన తర్వాత మీకు వారి మీద ఇంట్రస్ట్ ఉన్నట్టుగా మీ ప్రవర్తన ఉండేటట్లు చూసుకోండి. అందుకోసం మీ స్నేహితుల సాయం తీసుకోండి. ఈ రోజును జంటలు జరుపుకోకూడదనే నియమాలు ఏమీ లేవు. మీ భాగస్వామి/భార్య కోసం సమయాన్ని వెచ్చించండి. మీ ప్రియమైన వ్యక్తిని ప్రత్యేకంగా భావించేలా చేయండి. మీ క్రష్‌పై అదనపు శ్రద్ధ చూపించి.. మంచి డ్రెస్ వేసుకుని ఇంప్రెస్ చేయండి. కేఫ్ లేదా క్లబ్ లో మీరు ఉంటే.. కలిసి డ్యాన్స్ చేయమని వారిని అడగండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..