AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology Facts: ఇంట్లో బూట్లును ఇలా పెడుతున్నారా..? మీ గురించి సైకాలజీ చెప్పే నిజాలు ఇవే..

కొందరి ఇళ్లలో చూస్తే.. చెప్పులు, షూస్ అన్నీ పద్ధతిగా ఒకే వరుసలో అమర్చి ఉంటాయి. ఇది చూసి చాలా మంది వారికి అతి శుభ్రత లేదా కఠినమైన మనస్తత్వం అనుకుంటారు. కానీ సైకాలజీ దీని వెనుక ఒక అద్భుతమైన మైండ్ ట్రిక్ ఉందని చెబుతుంది ఇంటి ముంగిట చెప్పులను అలా లైన్‌గా పెట్టేవాళ్లు నిజానికి ఎంత స్మార్టో, ఆ అలవాటు వల్ల ఉదయాన్నే వారి మెదడుకు ఎంత శ్రమ తప్పుతుందో తెలిస్తే మీ అవాక్కవుతారు.

Psychology Facts: ఇంట్లో బూట్లును ఇలా పెడుతున్నారా..? మీ గురించి సైకాలజీ చెప్పే నిజాలు ఇవే..
Psychology Of Neatly Arranged Shoes
Krishna S
|

Updated on: Jun 19, 2026 | 6:57 PM

Share

కొందరు చేసే పనులు, వారి అలవాట్లను చూసి వాళ్లు ఎలాంటి వారే చెప్పేయొచ్చని సైకాలజీ చెప్తుంది. సాధారణంగా కొందరి ఇళ్లలోకి వెళ్లే ముందు లేదా తలుపు పక్కన చెప్పులు, షూస్ అన్నీ పద్ధతిగా, ఒకే వరుసలో అమర్చి ఉంటాయి. ఇలా చూసినప్పుడు చాలా మంది.. “అబ్బా.. వీళ్లకు శుభ్రత ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి పట్టుదలతో ఉంటారు” అని అనుకుంటారు. కానీ సైకాలజీ దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని పూర్తిగా వేరేలా చెబుతుంది. ఇంటి ముంగిట చెప్పులను పద్ధతిగా అమర్చడం అనేది కేవలం క్లీన్‌నెస్‌కు సంబంధించినది కాదు.. అది మీ మెదడు రోజువారీ శ్రమను తగ్గించుకోవడానికి తీసుకునే ఒక స్మార్ట్ డెసిషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఆఫీసులకో, స్కూళ్లకో వెళ్లేటప్పుడు అందరి ఇళ్లలోనూ తీవ్రమైన హడావుడి ఉంటుంది. టైమ్ అయిపోతుందనే టెన్షన్, పనుల ఒత్తిడి మధ్య.. బయలుదేరేటప్పుడు నా చెప్పులు ఎక్కడ ఉన్నాయి? ఏ షూస్ వేసుకోవాలి? అని వెతుక్కోవడం చాలా మందికి పెద్ద చికాకును తెప్పిస్తుంది. అదే చెప్పులు తలుపు పక్కనే లైన్‌గా అమర్చి ఉంటే, ఉదయాన్నే మెదడుకు ఎలాంటి శ్రమ లేకుండా, వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే కాళ్లకు వేసుకుని సింపుల్‌గా బయటకు వెళ్లవచ్చు. అంటే, రోజులోని మొదటి నిర్ణయాన్ని ఈ అలవాటు సులభతరం చేస్తుంది.

చిన్న అంతరాయం కూడా పెద్ద భారం

బిహేవియరల్ సైంటిస్టుల పరిశోధనల ప్రకారం.. ఉదయాన్నే మైండ్ ఇప్పటికే ఎన్నో పనుల షెడ్యూల్స్, డెడ్‌లైన్స్‌తో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చెప్పులు కనిపించకపోవడం వంటి చిన్న చిన్న సమస్యలు లేదా అంతరాయాలు కూడా మెదడుకు చాలా పెద్ద భారంగా, చికాకుగా అనిపిస్తాయి. అందుకే చెప్పులను ఒకే చోట స్థిరంగా ఉంచడం వల్ల ఉదయాన్నే వచ్చే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

కంట్రోల్ కోసం కాదు..కన్వీనియన్స్ కోసం

చెప్పులను పద్ధతిగా పెట్టేవాళ్లను చూసి.. వీళ్లు అన్నింటినీ తమ నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటారు అని అనుకోవడం పొరపాటని హ్యాబిట్ రీసెర్చ్ చెబుతోంది. ఇది జీవితాన్ని కఠినమైన నియమాలతో ఉంచే అలవాటు కాదు.. కేవలం ఒక ప్రాక్టికల్ షార్ట్‌కట్ మాత్రమే. ప్రతిరోజూ ఒకే వాతావరణంలో, ఒకే సిగ్నల్‌ను మెదడుకు అలవాటు చేయడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.

మానసిక శక్తి ఆదా.. రోజంతా హ్యాపీ

ఒక చిన్న అలవాటు రోజూ కొన్ని సెకన్ల సమయాన్ని, కొద్దిపాటి మానసిక శక్తిని ఆదా చేస్తుంది. ఈ చిన్న చిన్న ఆదాలు వారాలు, నెలలు, సంవత్సరాల పాటు సాగినప్పుడు మీ మెదడుపై అనవసరమైన డెసిషన్ మేకింగ్ ఒత్తిడి పడకుండా రక్షిస్తుంది. కీస్, బ్యాగ్స్, షూస్ అన్నీ అనుకున్న చోట ఉంటే.. ఇల్లు వదిలి బయటకు వెళ్లే ప్రక్రియ ఎంతో సాఫీగా సాగిపోతుంది.

కాబట్టి ఎవరైనా తమ షూస్‌ను పద్ధతిగా తలుపు ముందే లైన్‌గా పెట్టారంటే, వారు కఠినమైన మనస్తత్వం ఉన్నవారు కాదు.. బిజీగా ఉండే తమ ఉదయాన్ని మరింత ప్రశాంతంగా మార్చుకోవడానికి మైండ్‌ను ముందే సిద్ధం చేసుకుంటున్న స్మార్ట్ ప్లానర్స్ అని అర్థం. ఇప్పటి నుంచి తప్పుగా అర్థం చేసుకోవడం మానడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us