Vomiting Tips: ప్రయాణంలో వాంతులతో ఇబ్బందులు పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు

|

May 21, 2023 | 3:17 PM

చాలా మంది బస్సులో, కారులో, ఇతర వాహనాల్లో, రైళ్లల్లో ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. కొందరికేమో జర్నీ అంటే ఎంతో ఇష్టం. మరికొందరికేమో జర్నీ అంటేనే చిరాకు..

Vomiting Tips: ప్రయాణంలో వాంతులతో ఇబ్బందులు పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు
Vomiting Tips
Follow us on

చాలా మంది బస్సులో, కారులో, ఇతర వాహనాల్లో, రైళ్లల్లో ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. కొందరికేమో జర్నీ అంటే ఎంతో ఇష్టం. మరికొందరికేమో జర్నీ అంటేనే చిరాకు. ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే ప్రయాణంలో చాలా మందికి వాంతులు అవుతుంటాయి. అందుకే వారు భయపడిపోతుంటారు. కొందరికి బస్సులు, మరికొందరికి కార్లు, మరికొందరికి రైళ్లలో వాంతులు అవుతుంటాయి. ఈ వాంతుల కారణంగా వారు ప్రయాణానికి వెనుకడుగు వేస్తారు. అందుకే ఇలాంటివారు ప్రయాణాన్ని అస్సలు ఇష్టపడరు. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే ప్రయాణంలో ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

  1. నిమ్మకాయ: వాంతులు అయ్యేవారు ప్రయాణం చేస్తే వెంట నిమ్మకాయను ఉంచుకోవడం తప్పనిసరి. వాంతుల సమస్య పెరిగినప్పుడు దాని రసాన్ని లేదా వాసన చూస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మకాయను వాటర్ బాటిల్లలో కూడా ఉంచుకోవచ్చు. ఇది ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది.
  2. అరటిపండు: చాలా మందికి అరటి పండు అంటే ఎంతో ఇష్టం. జర్నీలో వాంతులు చేసుకునే వారు అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ బ్యాగులో అరిటిపండు ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అరటి పొటాషియం పునరుద్ధరించే గుణం కలిగి ఉంటుంది. వాంతుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
  3. అల్లం: అల్లం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగించే ఒక మసాలా. ఇది ప్రయాణంలో వాంతుల సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. వాంతుల సమస్య పెరిగినప్పుడు పచ్చి అల్లాన్ని నమిలితే అద్భుతమైన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి