Health Tips: మట్టి కప్పులో టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

|

Feb 06, 2024 | 10:10 AM

ఎందుకంటే చిన్న మట్టి కప్పులో వేడి టీ పోస్తే ఒక రకమైన వాసన వస్తుంది. ఈ రుచి పింగాణీ కప్పులు లేదా పేపర్ కప్పుల్లో రాదు. ఈ సువాసన టీ తాగే ఆనందాన్ని పెంచుతుంది. వేడి టీని మట్టి కప్పులో పోసినప్పుడు అది కొన్ని చిన్న రసాయన మార్పులకు లోనవుతుంది. అయితే ఇది మానవ శరీరానికి ఎలాంటి హాని కలిగించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టి కప్పులో టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Health Tips: మట్టి కప్పులో టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?
Clay Cup
Follow us on

ఇంటి నుంచి బయట పని కోసం వెళ్లే వారు, ఆఫీసుల్లో ఉద్యోగం చేసేవారికి రోజుకు ఒక్కసారైనా టీ లేదా కాఫీ తాగడం అలవాటు ఉండే ఉంటుంది. అయితే రోజూ పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని ఇప్పటికే మనం చాలా సందర్బాల్లో తెలుసుకున్నాం.. బయట ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంపై చాలా హానికరమైన ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఇంట్లో తయారు చేసిన టీ, లేదంటే మట్టి కప్పులో టీ తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి మట్టి కుండలో టీ తాగడం వల్ల శరీరానికి ఎంత మేలు జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

రోడ్డు పక్కన మట్టి కుండలో టీ అమ్మడం మీరు తరచుగా చూస్తుంటారు. వాస్తవానికి మట్టి కుండలో టీ వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై ఇదే టీ తాగేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే చిన్న మట్టి కప్పులో వేడి టీ పోస్తే ఒక రకమైన వాసన వస్తుంది. ఈ రుచి పింగాణీ కప్పులు లేదా పేపర్ కప్పుల్లో రాదు. ఈ సువాసన టీ తాగే ఆనందాన్ని పెంచుతుంది. వేడి టీని మట్టి కప్పులో పోసినప్పుడు అది కొన్ని చిన్న రసాయన మార్పులకు లోనవుతుంది. అయితే ఇది మానవ శరీరానికి ఎలాంటి హాని కలిగించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మట్టి కప్పులో టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి టీని మట్టి కుండలో పోయడం వల్ల దాని పోషక విలువలు పూర్తిగా సంరక్షించబడతాయి. కాగితం లేదా ప్లాస్టిక్ కప్పుల్లో ఉండదు. ఈ టీ తాగిన తర్వాత చాలా మంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అలాగే పాలతో చేసిన టీ తాగి చాలా మంది గుండెల్లో మంటతో బాధపడుతుంటారు. మట్టి కప్పులో టీ తాగడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం మట్టి కుండ టీలోని ఆమ్లతను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

పేపర్ లేదా ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కానీ ఈ కారకాలతో పోలిస్తే మట్టి కప్పు పూర్తిగా సురక్షితం.