Triphala: త్రిఫల చూర్ణం పాలతో తీసుకుంటే ఏమౌతుందో తెలుసా..? శీతాకాలం లాభాలు తెలిస్తే..

త్రిఫల పొడి అనేది శక్తివంతమైన ఆయుర్వేద సూత్రీకరణ. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని కూడా కాపాడుతుంది. అయితే, దీన్ని సరిగ్గా ఎలా తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. త్రిఫల పొడిని పాలతో కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? శీతాకాలంలో అది ఎలా పనిచేస్తుందో ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Triphala: త్రిఫల చూర్ణం పాలతో తీసుకుంటే ఏమౌతుందో తెలుసా..? శీతాకాలం లాభాలు తెలిస్తే..
Triphala Powder With Milk

Updated on: Nov 07, 2025 | 7:41 PM

ఆయుర్వేదం వివిధ వ్యాధులకు ఆహార నియమాలు, మూలికా నివారణలను వివరిస్తుంది. వేద కాలం నుండి ప్రజలు ఆరోగ్యకరమైన జీవనం కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి త్రిఫల చూర్ణం.. అంటే మూడు పండ్లతో చేసిన మిశ్రమం. ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఉంటుంది. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి చాలా ప్రత్యేకత ఉంది. త్రిగుణాలుగా పిలువబడే వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ గా ఉంచడంలో త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. కానీ, దానిని సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం. పాలతో అనేక మూలికలను తీసుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే, మీరు త్రిఫల పొడిని పాలతో తీసుకోవచ్చా లేదా ..? శీతాకాలంలో దానిని ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

త్రిఫల పొడి అనేక మొక్కల లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలకు కూడా మూలం. మీరు ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకోవచ్చు. త్రిఫలను రెండు విధాలుగా తీసుకోవచ్చు. పాలు, నీటితో. కాబట్టి, దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఉసిరికాయ:

ఇవి కూడా చదవండి

త్రిఫలలో ఎక్కువ మొత్తంలో ఉసిరికాయ ఉంటుంది. ఉసిరికాయలో ఫినాల్స్, టానిన్లు, ఫైలెంబెలిక్ ఆమ్లం, రుటిన్, కర్కుమినాయిడ్స్, ఎంబ్లికాల్ వంటి అనేక శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి. అదనంగా ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే త్రిఫల జుట్టుకు, చర్మ కణాలను రిపేర్ చేయడంలోనూ సహాయపడుతుంది. త్రిఫల తీసుకోవడం వల్ల వెంట్రుకలు దృఢంగా మారడంతో పాటు చర్మం మెరిసిపోతుంది. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం, త్రిఫల కంటికి కూడా మేలు చేస్తుంది.

కరక్కాయ:

కరక్కాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని చల్లబరచడంతో పాటు కఫం లాంటి సమస్యల్నీ దూరం చేస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకీ ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది. కరక్కాయలోని గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి సహాయపడతాయి, అలాగే శరీర బరువుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

తానికాయ:

కఫ దోషం వలన కలిగే అనారోగ్యాలకు మాత్రం తానికాయలు బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థలలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తానికాయులు నయం చేస్తాయి. ఇందులో టెర్పైన్స్, పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దగ్గు, కఫం, క్షయ, ఆస్తమా, ఎలర్జీలను నివారణ కోసం తానికామ మంచి మందుగా వాడబడుతోంది. డయేరియా, డీసెంట్రీ, చిన్న పేగుల వాపు తదితర వ్యాధులు తగ్గటానికి, ఉదర వ్యాధులను శాంత పరిచేందుకు, కేశ సంపదని పెంపొందించేందుకు, జుట్టు నల్ల బడేందుకు, కంటి చూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.

త్రిఫలను గోరు వెచ్చని పాలతో కలిపి తీసుకోవడం వల్ల సూపర్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో త్రిఫలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవచ్చు. మీకు ఏవైనా వైద్య పరిస్థితులు ఉంటే, ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి. ఆ తర్వాతే మీరు దానిని తీసుకోవాలి.

త్రిఫల శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నివారణలో త్రిఫల ప్రభావవంతంగా పనిచేస్తుంది. త్రిఫల తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రిఫల నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది.ప్రేగులలో పేరుకున్న విషాలు, వ్యర్థాలు బయటకు వెళతాయి. మలబద్దకం సమస్య కూడా నివారిస్తుంది. తద్వారా పైల్స్ వంటి సమస్యల బాధ ఉండదు. త్రిఫలలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది మంటను తగ్గిస్తుంది. మధుమేహానికి కూడా ప్రయోజనకరం. త్రిఫల అకాల వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది. ముఖంపై ముడతలు తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us