Coconut Oil Benefits: ఉదయాన్నే ఖాళీకడుపుతో కొబ్బరి నూనె తాగితే ఏమవుతుందో తెలుసా..?

|

Jan 23, 2025 | 1:18 PM

పరగడుపునే ఎక్కువ మంది నీళ్లు, కొన్ని రకాల కషాయాలు వంటి లిక్విడ్స్‌ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో హెర్బల్‌ డ్రింక్స్‌ అలవాటు చేసుకుంటున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె కూడా తాగొచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొబ్బరి నూనెలో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నూనె తాగితే ఎన్ని లాభాలో ఇక్కడ తెలుసుకుందాం..

Coconut Oil Benefits: ఉదయాన్నే ఖాళీకడుపుతో కొబ్బరి నూనె తాగితే ఏమవుతుందో తెలుసా..?
Coconut Oil
Follow us on

ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం తీసుకునే ఆహారం ఆ రోజు మన ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుంది. పరగడుపునే ఎక్కువ మంది నీళ్లు, కొన్ని రకాల కషాయాలు వంటి లిక్విడ్స్‌ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో హెర్బల్‌ డ్రింక్స్‌ అలవాటు చేసుకుంటున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె కూడా తాగొచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొబ్బరి నూనెలో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నూనె తాగితే ఎన్ని లాభాలో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన లక్షణాలు అనేకం ఉన్నాయి. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వాపులు మొదలవుతాయి. దీని కారణంగా కొవ్వు కణాలు శరీరానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేవు. కానీ కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడం ద్వారా కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు..బ్బరి నూనె బరువు తగ్గడంలో కూడా సహాయపడటంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరి నూనెలో సహజమైన ఆకలిని అణిచివేసే గుణాలు ఉన్నాయి. కొబ్బరి నూనె తీసుకోవడం ద్వారా పదే పదే తినాలనే కోరిక ఉండదు. అధిక కేలరీలను తీసుకోకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు వంట కోసం ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇది ఆకలిని తగ్గించటం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు అజీర్ణం, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాస్తవానికి, కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ కొబ్బరి నూనెను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు. లేదంటే, కప్పు కాఫీలో స్పూన్ కొబ్బరి నూనె యాడ్‌ చేసుకుని కూడా తీసుకొచ్చు. కొబ్బరి నూనె, కెఫిన్ కలిసి కెటోసిస్ ప్రక్రియను ప్రేరేపిస్తాయి. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..