గర్భంతో ఉన్న మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని, అలాగే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా నెలలు నిండే కొట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు గర్బావస్థలో ఆరోనెల దాటిన తర్వాత చివరి త్రైమాసికంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టాల్సిన బిడ్డపై అలాగే తల్లి ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంది. గర్భిణీలు ఆహారం విషయంలోనూ మానసిక ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే డెలివరీ సమయంలో ఇబ్బందులకు గురైన అవకాశం ఉంది అలాగే బిడ్డ ఆరోగ్యం పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
గర్భిణీలు చివరి మూడు నెలల పాటు ఇంటి నుంచి ఎక్కువగా బయటకు వెళ్ళకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకోవాలని బరువులు మోయకూడదని, అదే సమయంలో పోషకాహారం తీసుకోవాలని చెబుతుంటారు.
గర్భంతో ఉన్న మహిళ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా వారి హార్మోన్లలో చాలా తేడాలు వస్తుంటాయి. కనుక అలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇట్ట పోయే బిడ్డ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా చాలామంది గర్భిణీల్లో కలిగే ఓ సందేహం వారిని వేదిస్తూ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు సినిమా థియేటర్లో సినిమా చూడవచ్చా అనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అయితే దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొందరు థియేటర్లో సినిమా చూడటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని పర్వాలేదని చెబుతూ ఉంటారు. మరి థియేటర్ చాలా ప్రమాదమని చెబుతూ ఉంటారు.
నిజానికి థియేటర్లో సినిమా చూడటం వల్ల గర్భిణీలకు ప్రమాదమని ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించలేదు. థియేటర్లో సినిమాలు చూడటం ద్వారా గర్భంలో ఉన్న పిండంపై ప్రభావం చూపుతోందని ఎవరు పేర్కొనలేదు. అయితే గర్భిణీలు చీకట్లో సినిమా చూడటం ద్వారా కళ్ళకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గర్భంతో ఉన్న మహిళ శరీరంలో హార్మోన్లు క్రమ పద్ధతిలో ఉండవు కంటి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కావున థియేటర్లో సినిమాలు చూడకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
అదే సమయంలో థియేటర్లో వినిపించే పెద్దపెద్ద శబ్దాలు కారణంగా గర్భిణిీ రక్తపోటు పెరిగే అవకాశం ఉందని అందుకే, పెద్ద శబ్దాలు వినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు అయితే థియేటర్లో సినిమాలకు బదులు ఆడిటోరియంలో మంచి సంగీతము నృత్యం అలాగే చక్కటి హాస్యంతో కూడిన నాటకాలు చూస్తే మానసిక ఉల్లాసం కలుగుతుందని. గర్భిణీలకు కావాల్సిన మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..