
చాలామంది డైటింగ్ సమయంలో ఆకలిని భరించలేక మధ్యలోనే వదిలేస్తుంటారు. కానీ, ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే స్నాక్స్ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. వేయించిన శనగల నుంచి మఖానా వరకు.. మన ఇంట్లో అందుబాటులో ఉండే ఈ పదార్థాలు బరువు తగ్గించడంలో అద్భుతాలు చేస్తాయి.
1. వేయించిన శనగలు
వీటిలో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా అనిపించేలా చేసి ఆకలిని తగ్గిస్తుంది.
2. వేయించిన నట్స్
బాదం, వాల్‌నట్స్, జీడిపప్పులలో శరీరానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. ఇవి మెటబాలిజం (జీవక్రియ)ను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి.
3. ఫ్రై చేసిన చిలగడదుంప
చిలగడదుంప ముక్కలను తక్కువ నూనెతో ఫ్రై చేసుకుని తింటే, అందులోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ఫైబర్‌ను అందిస్తాయి.
4. వేయించిన మఖానా
తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉండే మఖానా బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
5. నల్లని శనగలు
వేయించిన నల్ల శనగల్లో ఐరన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా, అనవసరమైన ఆకలి కోరికలను నియంత్రిస్తాయి.
6. ఆకలిని అదుపు చేసే చిట్కా
ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల మీ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి, దీనివల్ల మీరు పదే పదే తినాలనే కోరిక కలగదు. వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే 6 నెలల్లోనే మీ శరీరంలో మార్పును గమనించవచ్చు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన తెలిపిన చిట్కాలను పాటించే ముందు మీ డైటీషియన్ లేదా వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.