Weight Loss Tips: ఇంట్లో నుంచే బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు వ్యాయామాలు చేస్తే సరి…

| Edited By: Anil kumar poka

Dec 21, 2022 | 11:52 AM

జిమ్ ఎక్విప్ మెంట్ ఉండదు కాబట్టి ఇంటి వద్ద వ్యాయామం చేయడానికి ఆలోచిస్తుంటాం. అయితే ఇంట్లోనే ఉండి రెగ్యులర్ వర్క్ అవుట్స్ చేయడంతో పాటు మరికొన్ని తేలికపాటి వ్యాయామాలను జత చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Weight Loss Tips: ఇంట్లో నుంచే బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ ఐదు వ్యాయామాలు చేస్తే సరి…
Weight Loss
Follow us on

చలికాలం అంటేనే ఉదయాన్నే లేవడానికి బద్ధకిస్తుంటాం. దీంతో వ్యాయామం అనే విషయం అటకెక్కుతుంది. జిమ్ కు కూడా వెళ్లకపోవడంతో విపరీతంగా బరువు పెరుగుతారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇంట్లోనే వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా జిమ్ కు వెళ్తామనే ఉద్దేశంతో ఇంటి వద్ద చేసే వ్యాయామాల గురించి పట్టించుకోం. అలాగే జిమ్ ఎక్విప్ మెంట్ ఉండదు కాబట్టి ఇంటి వద్ద వ్యాయామం చేయడానికి ఆలోచిస్తుంటాం. అయితే ఇంట్లోనే ఉండి రెగ్యులర్ వర్క్ అవుట్స్ చేయడంతో పాటు మరికొన్ని తేలికపాటి వ్యాయామాలను జత చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదు వ్యాయామాలు చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

జంపింగ్ జాక్స్ 

మొదటగా వ్యాయమం చేయడానికి సిద్ధపడి స్ట్రయిట్ గా నిలబడాలి. ఇప్పుడు మోకాళ్లను కొద్దిగా వంచి మీ కాళ్లను భుజం వెడల్పు కంటే కొంచెం దూరంగా జరపాలి. అదే సమయంలో మన చేతులను తలపై చప్పట్లు కొట్టినట్లుగా నిటారుగా పెట్టాలి. మళ్లీ స్టార్టింగ్ పొజిషన్ కు రావాలి. ఇలా స్పీడ్ గా చేస్తూ ఉండాలి. 

బర్పీస్

మొదటగా నిటారుగా నిలబడి మీ కాళ్లను దూరంగా పెట్టాలి. శరీరాన్ని స్క్వాట్ లోకి దించి చేతులను పాదాల ముందు నేలపై ఉంచాలి. అలాగే ప్లాంక్ భంగిమలో పాదాలను వెనుక జరపాలి. దీన్నే ఎక్కువగా చేయాలి. అనంతరం పాదాలను చేతుల వద్దకు జరిపి గాల్లోకి ఎగరాలి. ఇలా వీలైనంత ఎక్కువగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

పుషప్స్

శరీరంలోని ఎక్స్ ట్రా క్యాలరీ బర్న్ చేయడానికి పాలిమెట్రిక్ పుషప్స్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో మీ చేతులను నెట్టడం, పుషప్ ఎగువన ఒక సెకన్ గాలిలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా అధిక సంఖ్యలో క్యాలరీలను ఖర్చే చేయవచ్చు.

స్క్వాట్ జంప్స్

శరీరం నుంచి పాదాలను వెడల్పు చేసి స్క్వాట్ పొజిషన్ లోకి రావాలి. ఈ పొజిషన్ లో వెనుక పై బాగం పైకి ఉంటుంది. ఇలా ఉంచి ఒక్కసారిగా జంప్ చేయాలి. మళ్లీ స్క్వాట్ పొజిషన్ లోకి రావాలి. ఇలా వీలైనంత ఎక్కువ సార్లు చేయాలి.

హై నీస్

ఎడమ వైపు మోకాలును చెస్ట్ వరకూ ఎత్తాలి. అనంతరం దాన్ని దింపి కుడివైపు మోకాలును చెస్ట్ వరకూ ఎత్తాలి. ఇలా వీలైనంతగా కాళ్లను మారుస్తూ చేయాలి. ఇలా చేయడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కొచ్చు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి