బీరు, బ్రాంది తాగేవారికి ఈ సంగతి తెలుసా..! ఇప్పటి నుంచైనా పట్టించుకోండి లేదంటే ఆస్పత్రికే..

Drinking Alcohol: ఈ రోజుల్లో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. శుభకార్యమైనా, అశుభకార్యమైనా మందు పార్టీ ఉండాల్సిందే. మహిళలు కూడా ఇందులో చేరిపోయారు.

బీరు, బ్రాంది తాగేవారికి ఈ సంగతి తెలుసా..! ఇప్పటి నుంచైనా పట్టించుకోండి లేదంటే ఆస్పత్రికే..
Drinking Alcohol

Updated on: Oct 27, 2021 | 8:21 AM

Drinking Alcohol: ఈ రోజుల్లో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. శుభకార్యమైనా, అశుభకార్యమైనా మందు పార్టీ ఉండాల్సిందే. మహిళలు కూడా ఇందులో చేరిపోయారు. అయితే ఈ భయంకరమైన అలవాటు మానవ జీవనశైలిని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో మద్యం సేవించడం అనేది ఎక్కువగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. ఇక లివర్‌ని దెబ్బతీస్తుందనే విషయం ఎప్పటి నుంచో అందరికి తెలిసిన విషయమే. అయితే బీర్‌ తాగడం వల్ల శరీరంలోకి ఎన్ని కేలరీలు చేరుతున్నాయి. బ్రాందీ తాగడం వల్ల ఎన్ని కేలరీలు చేరుతున్నాయి అనే విషయాలను ముందుగా పరిశీలించాలి.

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరం. మితంగా తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ చాలామంది ఎక్కువగా తాగేస్తారు. ఉదాహరణకు.. ఒక గ్లాసు వైన్ నుంచి మీకు లభించే కేలరీలు విపరీతంగా ఉంటాయి. చాలాకాలం నుంచి మద్యం తాగుతున్నట్లయితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ఉంటాయి. ఆల్కహాల్ న్యూరోటాక్సిన్‌గా పని చేస్తుంది. నిర్ణయం తీసుకోవడాన్ని నియంత్రించే మెదడులోని భాగాలను నెమ్మదిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం, అధిక రక్తపోటు, కాలేయం దెబ్బతినడం జరగుతాయి.

ఎక్కువగా బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ ఏర్పడుతుంది. అంతేకాదు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇందులో ఆహారంలో ఉండే కేలరీల కంటే ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు డైరెక్ట్‌గా కేలరీలు శరీరంలోకి చేరిపోతాయి. ఇందులో పోషకాలు ఏమి ఉండవు. దీంతో శరీరంలో కొవ్వు మాదిరి నిల్వ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. బరువు పెరగడానికి దారి తీస్తాయి. సాధారణంగా సగటు ఆల్కహాలిక్ డ్రింక్‌లో గ్రాముకు 4–7 కేలరీలు ఉంటాయి. ఒక 100 గ్రాముల బీర్‌లో43 కేలరీలు ఉండవచ్చు. అదే మొత్తంలో వైన్‌లో దాదాపు 295 కేలరీలు ఉంటాయి. ఇక వీటిని కాక్‌టెయిల్, సిరప్‌లు లేదా జ్యూస్‌లతో మిక్స్ చేసినప్పుడు కేలరీలు ఇంకా ఎక్కువవుతాయి. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. మీరు ఖర్చు చేసే దానికంటే ఎక్కువ కేలరీలు మీ శరీరంలో ఉంటే బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Fuel Price Today: బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో రికార్డు స్థాయిలో..

Fact Check: రైల్వేలో ఉద్యోగం వచ్చిందంటూ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఇది మీ సమాచారం దోచేస్తుంది..ఎలా అంటే..

Mutton: మటన్‌ ప్రియులకు హెచ్చరిక..! జర చూసి కొనండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..

Follow Us