AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: టీకి ముందా లేక తర్వాతా? నీళ్లు ఎప్పుడు తాగడం మంచిది.. నిపుణులు ఏమంటున్నారు

టీ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఎన్ని టెన్షన్స్ ఉన్న ఒక్క టీ తాగితే సరిపోతుంది అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మందికి టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?. కాబట్టి టీ తాగే ముందా లేదా తర్వాత నీరు ఎప్పుడు తాగడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: టీకి ముందా లేక తర్వాతా? నీళ్లు ఎప్పుడు తాగడం మంచిది.. నిపుణులు ఏమంటున్నారు
Drink Water After Tea
Anand T
|

Updated on: Apr 16, 2026 | 3:34 PM

Share

చాలా మందికి తిన్న వెంటనే నీళ్లు తాగినట్లే, టీ తాగిన తర్వాత కూడా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ సైన్స్, ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలావాటు కారణంగా భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు తాగాలా? ఒకవేళ తాగితే ఎంత సమయం తర్వాత తాగాలి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

టీ తాగడానికి ముందు నీళ్లు తాగవచ్చా?

టీ తాగే ముందు నీరు తాగడం చాలా మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీ అనేది అసిడిక్ అమ్ల స్వభవాన్ని కలిగి ఉంటుంది. దీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి టీ తాగడానికి 10-15 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే, అది కడుపులో ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల టీ తాగినప్పుడు అసిడిటీ, గుండెల్లో మంట వంటి రాకుండా అడ్డుకుంటాయి.

దంతాల రక్షణ: అలాగే టీలో ఉండే ‘టానిన్’ అనే మూలకం దంతాలపై పసుపు రంగు పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి ముందుగా నీళ్లు తాగడం వల్ల దంతాలపై ఒక హైడ్రేటెడ్ పొర ఏర్పడి, మరకలు పడకుండా కాపాడుతుంది. టీ సహజంగా శరీరం నుండి నీటిని బయటకు పంపుతుంది. టీకి ముందే నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత తగ్గుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రెట్‌ కాకుండా కాపాడుతుంది.

టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం సరైనదేనా?

టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల దంత ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. టీ వేడిగా ఉంటుంది, నీళ్లు సాధారణంగా చల్లగా ఉంటాయి. హఠాత్తుగా ఉష్ణోగ్రత మారడం వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతింటుంది. దీనివల్ల పళ్లలో జువ్వున లాగడం మొదలవుతుంది.

జీర్ణక్రియలో ఇబ్బందులు: ఆయుర్వేదం ప్రకారం, వేడి పదార్థం తీసుకున్న వెంటనే చల్లని పదార్థం తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత అసమతుల్యంగా మారుతుంది. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి, కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు టీ తాగిన తర్వాత నీళ్లు తాగాలనుకుంటే, కనీసం 20 నుండి 30 నిమిషాల వరకు వేచి ఉండటం మంచిది. ఆ తర్వాతే నీరు తాగడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు