Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని జీన్స్, షర్టులు వేయాలి.. ఈ తప్పులు చేశారో మెషీన్ పని అయిపోయినట్లే..

టెక్నాలజీ పుణ్యమా అని మన పనులు చాలా ఈజీ అయ్యాయి. ముఖ్యంగా వాషింగ్ మెషీన్ రాకతో బట్టలు ఉతకడం అనే కష్టమైన పని చిటికెలో పూర్తవుతోంది. అయితే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మెషీన్లు త్వరగా పాడవుతుంటాయి. అసలు మీ మెషీన్ కెపాసిటీ ఎంత..? అందులో ఎన్ని బట్టలు వేయాలో తెలుసుకోండి.

Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని జీన్స్, షర్టులు వేయాలి.. ఈ తప్పులు చేశారో మెషీన్ పని అయిపోయినట్లే..
Washing Machine Load Guide

Updated on: Jan 20, 2026 | 7:33 AM

ఇప్పట్లో వాషింగ్ మెషీన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. కానీ మెషీన్ కొన్నప్పటి నుంచి దాని కెపాసిటీ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. మనం చేసే అతిపెద్ద తప్పు ఓవర్‌లోడింగ్. మెషీన్ నిండా బట్టలు కుక్కడం వల్ల అవి సరిగ్గా తిరగవు, దీనివల్ల మురికి వదలకపోగా మోటార్‌పై ఒత్తిడి పడి మెషీన్ పాడయ్యే అవకాశం ఉంది. చాలామంది వాషింగ్ మెషీన్ 6 కేజీలు లేదా 7 కేజీలు అంటే తడి బట్టల బరువు అని అనుకుంటారు. కానీ అది పొడి బట్టల బరువును సూచిస్తుంది. మెషీన్ డ్రమ్‌ను ఎప్పుడూ పూర్తిగా నింపకూడదు. కేవలం 70శాతం నుండి 80శాతం వరకు మాత్రమే నింపి, మిగిలిన భాగాన్ని నీరు, సబ్బు తిరగడానికి ఖాళీగా ఉంచాలి.

చిన్న కుటుంబాలకు లేదా జంటలకు 6 నుండి 7 కిలోల కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్ సరిపోతుంది. ఇందులో ఒకేసారి దాదాపు 15 నుండి 20 దుస్తులను సులభంగా ఉతకవచ్చు. అదే 3 లేదా 4 మంది సభ్యులు ఉన్న మధ్యస్థ కుటుంబాలకైతే 7 నుండి 8 కిలోల మెషీన్ ఉత్తమం. ఇది సుమారు 30 నుండి 35 దుస్తులను ఒకేసారి ఉతికే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల సమయం, విద్యుత్ రెండూ ఆదా అవుతాయి.

ఏ మెషీన్‌లో ఎన్ని బట్టలు వేయాలి?

మీ ఇంట్లో ఉన్న మెషీన్ కెపాసిటీని బట్టి ఈ కింద సూచించిన విధంగా బట్టలు వేస్తే మెషీన్ ఎక్కువ కాలం మన్నుతుంది:

మెషీన్ బట్టి ఎన్ని వేయాలంటే..?

  • 6 – 7 కేజీలు – 15 – 20 దుస్తులు (2 జీన్స్, షర్టులు, టవల్స్, బెడ్‌షీట్, మిగితా సన్నబట్టలు
  • 7 – 8 కేజీలు – 30 – 35 దుస్తులు (3 జీన్స్, షర్టులు, టవల్స్, బెడ్‌షీట్లు, మిగితా సన్నబట్టలు
  • 8 – 9 కేజీలు – దాదాపు 40 దుస్తుల వరకు.. భారీ దుప్పట్లు కూడా ఉతకవచ్చు.
  • 10 కేజీలు – 50 కంటే ఎక్కువ దుస్తులు.. కర్టెన్లు, క్విల్ట్‌లు సులభంగా ఉతకవచ్చు.

మెషీన్ లైఫ్ పెరగాలంటే బట్టల రకాన్ని బట్టి లోడ్ చేయాలి. జీన్స్ వంటి బరువున్న బట్టలు వేసినప్పుడు సంఖ్యను తగ్గించుకోవడం మంచిది. తద్వారా విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా బట్టలు కూడా శుభ్రంగా వస్తాయి. వచ్చేసారి మీరు వాషింగ్ మెషీన్ ఆన్ చేసే ముందు, డ్రమ్‌లో తగినంత ఖాళీ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సరైన పద్ధతిలో వాడితే మీ మెషీన్ మరియు మీ బట్టలు రెండూ సురక్షితంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..