Pregnancy: ఈ విటమిన్‌ లోపం ఉంటే.. గర్భం దాల్చడం కష్టం. నిపుణులు ఏం చెబుతున్నారంటే

|

Jul 25, 2024 | 1:27 PM

మహిళలు గర్భం దాల్చడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు గర్భం దాల్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ప్రధానమైంది విటమిన్‌ బీ 12. పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు...

Pregnancy: ఈ విటమిన్‌ లోపం ఉంటే.. గర్భం దాల్చడం కష్టం. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Pregnancy
Follow us on

అమ్మకావడం ప్రతీ మహిళలకు ఒక అందమైన అనుభూతి. స్త్రీకి పరిపూర్ణత మాతృత్వంతోనే వస్తుందని అంటుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. వీటిలో ప్రధానమైన కారణాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు గర్భం దాల్చడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు గర్భం దాల్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ప్రధానమైంది విటమిన్‌ బీ 12. పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్‌ లోపం కారణంగా గర్భం దాల్చడంలో సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిలో బీ12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది.

శరీరంలో నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్‌ బీ12 ఉపయోగపడుతుంది. అలాగే మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకు కూడా విటమిన్‌ బీ12 కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అండాల అభివృద్ధిలో విటమిన్‌ బీ12దే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అండాల అభివృద్ధిలో తలెత్తే సమస్య కారణంగా పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. ఇక విటమిన్‌ బీ12 లోపం కారణంగా పురుషుల్లో సంతానలేమి సమస్య దారి తీస్తుందని అంటున్నారు. స్పెర్మ్‌ కౌంట్, నాణ్యతపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

విటమిన్‌ బీ12 లోపంతో బాధపడేవారు మాసం, చేపలు, గుడ్లతో పాటు పాలను క్రమంతప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ మీరు శాఖాహారులైతే బి12 సప్లిమెంట్లను తీసుకోవాలి. అయితే ఇందుకోసం ముందుగా వైద్యులను సంప్రదించాలి. ఇందులో భాగంగా వైద్యులు విటమిన్‌ బీ12 మాత్రలను సూచిస్తారు. ఇక విటమిన్‌ బీ12 లోపం ఉంటే వైద్యులు ఇంజెన్లను కూడా అందిస్తారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..