వాస్తును చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే మరికొంత మంది మాత్రం వాస్తును ఏమాత్రం నమ్మరు. వాస్తును నమ్మడమంటే అదో మూఢనమ్మకంగా చాలా మంది చూస్తారు. కాని ఇళ్లు నిర్మించేటప్పుడు కాని, లేదా ఇళ్లు, స్థలం లాంటివి కొనేటప్పుడు ముఖ్యంగా వాస్తు చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే మన జాతకానికి ఆ వాస్తుకు సరిపోలుతుందో లేదో కూడా చూస్తూ ఉంటారు. ఇదొక రకం అయితే ఇంట్లో కూడా వాస్తును పట్టించుకునేవారు చాలామంది ఉంటారు. ఏ వస్తువు ఏ మూలన ఉండాలి. ఏ వస్తువు ఏ దిక్కున పెట్టాలి అనే పట్టింపులు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో జాతకాలను బట్టి కూడా వాస్తు ఆధారపడి ఉంటుంది. పలానా మూలన ఎక్కువ బరువు పెట్టకూడదు. మరో మూలన కొన్ని రకాల వస్తువులు పెట్టకూడదనే ఆచారాలను పాటిస్తారు. వాస్తు శాస్త్ర నిపుణులు కూడా ఇలాంటి విషయాలను చెబుతూ ఉంటారు. ఇంటి వాస్తును బట్టి ఆ కుటుంబం ఎదుగుదల ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఇటువంటి వాటిని చాలా మంది విశ్వసిస్తారు కూడా. జీవితంలో వారు చూసిన ఎత్తు పల్లాలు, అనభవాలను బట్టి కొంతమంది ఈవాస్తు శాస్త్రాన్ని చాలా ఎక్కువుగా విశ్వసిస్తారు. కొన్ని సందర్భాల్లో వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పింది చెప్పినట్లు జరగడంతో చాలా మంది వాస్తుకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
సాధారణంగా ఏదైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవితం గడపాలని కోరుకుంటారు. అయినప్పటికి కొన్ని సార్లు కుటుంబ కలహాలతో ఎన్నో ఇబ్బందులు పడుతూఉంటారు. కొన్ని కుటుంబాల్లో శాంతి అసలే కనబడదు. ఇలాంటి వాటికి వారి జాతకం, వాస్తు కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే కుటుంబంలో సంతోషం, శాంతి ఉండాలంటే వంటగదిలో కొన్ని వస్తువులను ఉంచకూడదని, ఆ వస్తువులు వంటగదిలో ఉంటే కుటుంబంలో కలహాలు తప్పవంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అవెంటో తెలుసుకుందాం.
ఒక్కోసారి నిజంగా చిన్న చిన్న పొరపాట్లతో ఇంట్లో పెద్ద పెద్ద తగదాలే జరుగుతూ ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే ఆ ఇంట్లో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుందరి వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా దోషాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. అలాంటి వస్తువులు వంట గదిలో ఉంటే తక్షణమే వాటిని తీసివేయాలని సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి.
మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు పని సులవును చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే టిఫిన్ల కోసం కొద్ది రోజులకు అవసరమైన పిండిని ఒకేసారి తయారుచేసుకుని దానిని ఫ్రిజ్ లో పెట్టి ఉపయోగిస్తుంటారు చాలా ఇళ్లలో. కాని వాస్తు ప్రకారం ఇలా చేయకూడదంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు. వాస్తు ప్రకారం నిల్వ పిండిని వంటగదిలో ఉంచడం సరైనది కాదని, ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా శని, రాహువులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. గ్రంధాల ప్రకారం పిసికిన పిండిని నిల్వ చేసి ఉంచడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయని, దీనిని తప్పుగా పరిగణించబడుతుందంటున్నారు పండితులు.
ఎక్కువ మంది అన్ని వస్తువులను ఉంచేందుకు వంటగదినే ఉపయోగించుకుంటూ ఉంటారు. చివరికి చాలా మంది మందులను కూడా వంటగదిలో భద్రపరుస్తూ ఉంటారు. మహిళలు అయితే ఎక్కువ వంట గదిలోనే ఉంటారు. అలాగే ఇంట్లో భర్త లేదా ఇంకెవరికైనా మందులు ఇచ్చేది కూడా ఇంట్లో ఆడవాళ్లే. అందుకే వారికి అనువుగా ఉండే వంటగదిలో మందులను కూడా పెడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మందులను వంటగదిలో ఎప్పుడూ ఉంచకూడదని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మందులను వంటగదిలో పెట్టడం ద్వారా మనం బాధపడే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ఆరోగ్య సమస్యలు ఎక్కువై వైద్యం కోసం అధిక డబ్బు ఖర్చు అవుతుందని వాస్త్రు శాస్త్ర పండితులు చెబుతున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మందులను వంటగదిలో పెట్టవద్దని సూచిస్తున్నారు.
కొంత మంది ఇళ్లలో వంట గదిలోనే ఓవైపు పూజా మందిరాన్ని పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం ఇలా పెట్టుకోకూడదంటున్నారు పండితులు. వంట గది అన్నపూర్ణ తల్లి స్థానమని, అగ్నిదేవుడు కూడా ఇక్కడ కొలువై ఉంటాడు. అయితే వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడూ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదని, కిచెన్ లో సాత్విక, తామసిక ఆహారాన్ని వండుతూ ఉండంటం వల్ల వంటగదిలో పూజా గది నిర్మాణం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు.
వంట గదిలో ఉన్న వస్తువులు ఒక్కోసారి చేయి జారి కింద పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు విరిగిపోతాయి. మరికొన్ని పగిలిపోతాయి. సాధారణంగా విరిగిన, పగిలిన పాత్రలను వెంటనే పాడేస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం పగిలిన వస్తువులను వంట గదిలో పెట్టుకుని, కొన్నాళ్లు వాడదాములే అనే ఆలోచనలో ఉంటారు. అయితే వాస్తు ప్రకారం విరిగిన, పగిలిన పాత్రలను ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే పరస్పర విభేదాలు కూడా పెరుగుతాయంటున్నారు.
ఇంట్లోకి చాలా మంది పాదరక్షలతో వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో కూర్చుని బూట్లు వేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో మాత్రం పాదరక్షలు ధరించకూడదని, పాదరక్షలతో వంట గదిలోకి వెళ్లకూడదని చెబుతున్నారు. అన్నపూర్ణ దేవికి వంటగది క్షేత్రం కాబట్టి వంట గదిలోకి పాదరక్షణలు ధరించి రాకూడదని సూచిస్తున్నారు.