Promise Day 2022: ఈ ప్రామిస్‌లు చేశారంటే మీ బంధం ఎక్కువ రోజులు నిలువదు! వీటితో జాగ్రత్త..

|

Feb 11, 2022 | 6:20 PM

మీ ప్రేమ మరింత చిగురించి అందమైన పువ్వులు పూయాలంటే ఈ ప్రామిట్‌ డే రోజున మీ ప్రియమైన వారికి ఈ వాగ్ధానాలు అస్సలు చేయకండి. అవేంటంటే..

Promise Day 2022: ఈ ప్రామిస్‌లు చేశారంటే మీ బంధం ఎక్కువ రోజులు నిలువదు! వీటితో జాగ్రత్త..
Promise Day 2022
Follow us on

valentine week: ఇంకొన్ని గంటల్లో ప్రేమికుల రోజు రానుంది. ప్రపంచవ్యాప్తంగా లవ్ బర్డ్స్‌ ఈ రోజు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే, ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు)కు వారం రోజుల ముందే సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏడాది ఈ వారంరోజులను వ్యాలంటైన్‌ వీక్‌గా జరుపుకోవడం ఆనవాయితి. అంటే ఈ వారంలో ప్రతిరోజును ఒక్కో స్పెషల్‌ రోజుగా జరుపుకుంటారన్నమాట. ఆలెక్కన ఈరోజు (ఫిబ్రవరి 11)ను ప్రామిస్ డేగా జరుపుకుంటారు. ఐతే మీ ప్రేమ మరింత చిగురించి అందమైన పువ్వులు పూయాలంటే ఈ ప్రామిట్‌ డే రోజున మీ ప్రియమైన వారికి ఈ వాగ్ధానాలు అస్సలు చేయకండి. అవేంటంటే..

నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను..
ఇది ఎప్పటికీ చేయకూడని ప్రామిస్‌గా చరిత్రలో మిగిలిపోయింది. ఎందుకంటే మీ నూరెళ్ల ప్రయాణం ఫేక్‌ ప్రామిస్‌లతో నిండిపోకూడదు కదా! ప్రతి బంధంలో కొన్ని హెచ్చుతగ్గులుండటం సాధారణమే. మీ ప్రియ సఖిని బాధపెట్టకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తూ.. మీ ప్రయాణం మునుముందుకు సాగాలంటే ఈ ప్రామిస్‌ అస్సలు చేయకూడదు.

నిన్ను ఎప్పటికీ బాధపెట్టను..
కొన్ని మధురమైన క్షణాలు, మరికొన్ని చేదు అనుభవాలు కూడా ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ ఉంటాయి. దానర్ధం మీ మధ్య ప్రేమ ఉండదని కాదు. నిన్ను ఎప్పటికీ బాధ పెట్టనని ప్రామిస్‌ చేశాక.. రెండు రోజులకో, మూడు రోజులకో అనుకోని కారణాలవల్లనే మీ పార్ట్నర్‌ బాధపడితే మీ ప్రామిస్‌కు విలువుండదు. అంతేకాదు వారిని మరింత బాధపెట్టినవారౌతారు. మీపై నమ్మకం కోల్పోవడం కూడా జరగొచ్చు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఆర్గ్యూలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రామిస్‌తో జర జాగ్రత్త సుమీ!

నీతో ఎప్పటికీ అబద్ధం చెప్పను..
మీ పార్ట్నర్‌ ఫీలింగ్స్‌ను గాయపరచకుండా ఉండటానికి మీరు అబద్ధం చెప్పే పరిస్థికి ఖచ్చితంగా వస్తుంది. అబద్ధం వరకు ఫర్వాలేదు కానీ.. వాటికి కొత్తకొత్త ఊహలను జోడించి వాస్తవాన్ని దాచే బదులు.. ఉన్న విషయం చెప్పడం బెటర్‌! మీరే మంటారు..నిజమే కదా!

నీపై ఎప్పటికీ కొప్పడను..
సన్నిహితులతో గొడవపడకుండా ఉండటం అనేది దాదాపు అసాధ్యమని మనందరికీ తెలిసిందే! అందుకని ‘నీపై ఎప్పటికీ కోపం తెచ్చుకోను’ ఈ విధమైన ప్రామిస్‌ చెయ్యకపోవడమే మంచిది. ఏదైనా కారణంతో చిరాగ్గా ఉన్న రోజున వారిపై కోప్పడితే.. కొంత టైం తర్వాత మీరే వెళ్లి సారీ! చెప్పడం మంచిది. గుడ్‌ రిలేషన్‌లో ఈ విధమైన సంభాషణలు లేకపోతే అనతికాలంలోనే అపార్ధలు చోటుచేసుకుంటాయి.

ఇప్పటి నుంచి మానేస్తాను..
మీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటుంటే.. మీ పార్ట్నర్‌కి అది ఇష్టంలేకపోతే.. వెంటనే మానేస్తా డియర్‌! అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే.. మీరు చెప్పిన తర్వాత ఆ అలవాటు మానకపోయినా, మానివేసి తర్వాత మళ్లీ ప్రారంభించినా మీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎప్పుడైతే మానెయ్యడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడే చెప్పండి మానేస్తానని. తను కోరగానే ప్రామిస్‌ చేశారంటే చిక్కుల్లో పడిపోతారు.

Also Read:

NCSCM jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! ఎన్సీఎస్సీఎమ్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..