Uttarpradesh Woman: ఎనిమిదేళ్లలో 28 వేల తాబేళ్ల సహా మొసళ్లు, గంగా డాల్ఫిన్‌లను కాపాడిన ఓ ప్రకృతి ప్రేమికురాలు..

Uttarpradesh Woman: ప్రకృతిలోని అడవులు, జంతువులు ఇలా అన్నీ బాగుంటేనే.. మానవజీవితం మనుగడకు ఆధారం. అయితే మనిషి జీవన ప్రయాణంలో అత్యాశతో..

Uttarpradesh Woman: ఎనిమిదేళ్లలో 28 వేల తాబేళ్ల సహా మొసళ్లు, గంగా డాల్ఫిన్‌లను కాపాడిన ఓ ప్రకృతి ప్రేమికురాలు..
Arunima Singh

Updated on: Nov 20, 2021 | 1:09 PM

Uttarpradesh Woman: ప్రకృతిలోని అడవులు, జంతువులు ఇలా అన్నీ బాగుంటేనే.. మానవజీవితం మనుగడకు ఆధారం. అయితే మనిషి జీవన ప్రయాణంలో అత్యాశతో ప్రకృతిని పట్టించుకోకుండా చేస్తున్న పనులతో జలజీవ రాశులు, జంతువులు అంతరించిపోతున్నాయి. అలా అంతరించి పోతున్న అరుదైన తాబేళ్లను ఓ యువతి రక్షిస్తుంది.  అందుకుగాను 2021 ఏడాది గాను నాట్‌వెస్ట్ గ్రూప్ ఎర్త్ హీరోస్ సేవ్ ది స్పేసీస్ అవార్డును అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..

భారతదేశంలోని అరుదైన తాబేళ్లను రక్షిస్తున్న ప్రకృతి ప్రేమికురాలు అరుణిమా సింగ్.  ఆ యువతి అరుదైన తాబేళ్లు, తాబేళ్లు, మొసళ్లు, గంగా డాల్ఫిన్‌లను రక్షిస్తుంది. గత 8 సంవత్సరాలుగా అరుణిమా సింగ్ సుమారు 28,000 తాబేళ్లను రక్షించింది. ఒక అద్భుతమైన పర్యావరణ పరిరక్షకురాలిగా ఖ్యాతిగాంచింది. 

ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకి చెందిన అరుణిమా సింగ్ గ్రామీణ పట్టణాల్లోని సుమారు 50 వేల మంది పిల్లలకు మంచినీటి సరీసృపాల సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తున్నది. అనధికారికంగా ఉత్తరప్రదేశ్‌లో గత 8 సంవత్సరాలలో 28,000 తాబేళ్లు, 25 గంగా డాల్ఫిన్లు, 6 మార్ష్ మొసళ్లు,  4 ఘారియల్‌లను రక్షించించారు. వాటిల్లో కొన్నిటికి పునరావాసం కల్పించగా.. కొన్నిటిని మళ్ళీ నీటిలో విడుదల చేశారు.

అయితే తనకు తాబేళ్లు, మంచి నీటిలో సంచరించే సరీసృపాల పట్ల ఆకర్షణ చిన్నతనంలో ఏర్పడిందని అరుణిమ చెప్పారు. తాను తన తాతతో కలిసి.. తరచుగా నది వద్దకు వెళ్ళినప్పుడు పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువ ఏర్పడిందని తెలిపింది. 2010లో లక్నో విశ్వవిద్యాలయం నుంచి  లైఫ్ సైన్స్‌లో మాస్టర్స్ కోర్సు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత..  అంతరించిపోతున్న మంచినీటి తాబేళ్లు, తాబేళ్లు, ఇతర జలచర జాతుల పరిరక్షణ  విషయంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం, తాను మంచినీటి తాబేళ్లపై దృష్టి సారించి పీహెచ్‌డీని చేస్తున్నట్లు అరుణిమ చెప్పింది.

ఉమ్మడి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ,  TSA ఇండియా ప్రోగ్రాం ఫర్ ఆక్వాటిక్ బయాలజీ ద్వారా.. 10 కంటే ఎక్కువ జాతుల తాబేళ్ల కోసం హామీ కాలనీలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ కాలనీల్లో ఎక్కువగా అంతరించిపోతున్న తాబేళ్లు ఉన్నాయి.  అంతేకాదు 300 మచ్చల తాబేళ్లకు పునరావాసం కల్పించింది. అలా 60 రోజులు సంరక్షించి అనంతరం వాటిని అడవిలోకి  విడిచి పెట్టింది. అయితే ఇవి మెత్తటి పెంకులు కలిగిన ఆరుదైన తాబేళ్లు.. వీటిని విచక్షణా రహితంగా వేటగాళ్లు  వేటాడుతున్నారు. అంతరించే విధంగా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు రోజు రోజుకీ అంతరించి పోతున్న తాబేళ్లనే కాదు.. సాధారణ తాబేళ్లను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్మగ్లింగ్ చేయబడే అంతరించిపోతున్న జాతుల గురించి క్షేత్రంలో సమాచారాన్ని సేకరించి.. ఆ సమాచారాన్ని పోలీసులకు లేదా అటవీ శాఖకు చేరవేస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం వేలాది తాబేళ్లను రక్షిస్తుంది. వాటికి పునరావాసం కల్పించడంలో సహాయం అరుణిమ సహాయం చేస్తుంది. కొన్నిటిని సంరక్షించి తిరిగి అడవిలోకి విడుదల చేస్తామని అరుణిమ చెబుతుంది. గత ఎనిమిదేళ్లుగా అరుణిమ చేస్తున్న పనిని పర్యవరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

Also Read:   రాగల 48 గంటల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..