Smartphone: రాత్రుళ్లు స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్నారా.? మీకు ఆ సమస్య తప్పదంటొన్న పరిశోధకులు..

అయితే స్మార్ట్ ఫోన్‌ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత నిజం ఉందో, అదే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు స్మార్ట్ ఫోన్‌తో లాభాలు ఉన్నట్లే, నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే క్రమంలో కొందరు వీటికి బానిసలుగా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, యువత స్మార్ట్ ఫోన్‌ లేకపోతే క్షణం ఉండలేని పరిస్థితి నెలకొంది...

Smartphone: రాత్రుళ్లు స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్నారా.? మీకు ఆ సమస్య తప్పదంటొన్న పరిశోధకులు..
Using Smartphones At Night

Updated on: Oct 16, 2023 | 5:10 PM

స్మార్ట్ ఫోన్‌.. మనిషి జీవితంలో ఇప్పుడు ఇదొక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కచ్చితంగా చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిందే. ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సాధానం, కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తో చేయలేని పనంటూ లేదు. ఫోన్‌ రీఛార్జ్‌ నుంచి స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు వరకు అన్నింటికీ స్మార్ట్ ఫోన్‌లోనే చేసేసే రోజులు వచ్చేశాయ్‌.

అయితే స్మార్ట్ ఫోన్‌ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత నిజం ఉందో, అదే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు స్మార్ట్ ఫోన్‌తో లాభాలు ఉన్నట్లే, నష్టాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే క్రమంలో కొందరు వీటికి బానిసలుగా మారిపోతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, యువత స్మార్ట్ ఫోన్‌ లేకపోతే క్షణం ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆరోగ్యంపై కూడా స్మార్ట్‌ ఫోన్‌ ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఎన్నో రకాల వ్యాధులకు స్మార్ట్ ఫోన్‌ కారణంగా మారుతోంది.

తాజాగా పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోయే విధానం, చురుకుదనం, మన మానసిక స్థితి, శరీర ఉష్ణోగ్రత, ఆకలి వంటివన్నీ.. మెదడులోని మాస్టర్‌ క్లాక్‌ నియంత్రణ ఆధారంగా ప్రతిరోజూ మారుతూ ఉంటాయని యూకేలోని బ్రిస్టల్‌ యూనివర్సిటికీ చెందిన బ్రిస్టల్‌ మెడికల్ స్కూల్‌కి చెందిన పరిశోధకుడు ఈ విషయాలను వెల్లడించారు. శరీరంలో విడుదలయ్యే హార్మోన్లలో అత్యంత శక్తివంతమైన వాటిలో కార్టిసాల్ ఒకటి. దీనిని ఒత్తిడి హార్మోన్‌గా పిలుస్తుంటారు. ఇది మెదడులోని అడ్రినల్‌ గ్రంధుల నుంచి ప్రతిరోజూ ఉదయం విడుదలవుతుందని ఆయన తెలిపారు.

కృతిమ కాంతికి ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల శరీరంలో ఒత్తిడి పెంచే కార్జిజాల్‌ రసాయనాలు ఉత్పత్తి పెరుగుతాయి. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ ద్వారా వచ్చే బ్లూ లైట్ కళ్లతో పాటు శరీరంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడుపై దుష్ఫ్రభావంతో పాటు, నీరసం, పగటిపూట చలి, అర్థరాత్రి వేడెక్కడం, పగటిపూట ఆకలి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిశోధకులు బృందం ఎలుకలకు కార్టిసాల్‌ లాంటి హార్మోన్లను ఇచ్చారు.

అనంతరం వాటిలో జరిగిన మార్పుల ఆధారంగా పైన తెలిపిన వివరాలను పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో తేలిన వివరాలను సెప్టెంబర్‌ 29న తేదీన నేచర్‌ కమ్యూనికేషన్స్‌ బయాలజీ జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు. అయితే కార్టిసాల్‌ హార్మోన్‌ ప్రభావం మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధక బృందం చెబుతోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..