
శరీరంలోని ప్రతి భాగం అవసరమే. ముఖ్యంగా శరీరంలోని కళ్లను మృదువైన శరీర భాగంలా చూస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా కంటి సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్నాయి. దీంతో ప్రస్తుత రోజుల్లో ప్రజలు చాలామంది కంటి సమస్యలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే కళ్లద్దాలతో అందరూ దర్శనమిస్తున్నారు. కంటి సంరక్షణలో చిన్న లోపం కూడా చాలా భారంగా మారుతుంది. ఈ రోజుల్లో పిల్లలు లేదా పెద్దలు అనే తేడా లేకుండా అందరూ తమ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అలాంటి సందర్భాల్లో కంటి నొప్పితో తరచుగా సమస్య ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లు బలహీనపడతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లు బలహీనపడతాయి. మీరు మొబైల్ పరికరాలు లేదా ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం వల్ల కంటి నొప్పిని ఎదుర్కొంటుంటే దాని నుంచి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
మీరు మొబైల్ పరికరాలతో పాటు ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కళ్లలో నొప్పి రావడం వస్తే కీరదోసకాయ మీకు ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిని వదిలించుకోవడానికి మీరు దోసకాయ ముక్కలను కట్ చేసి 20 నిమిషాల పాటు కళ్లపై ఉంచవచ్చు. ఇది కాకుండా మీరు కీర దోసకాయ తురుము కింద చేసి కూడా మీ కళ్లక ప్యాక్ కింద పెట్టుకోవచ్చు. కీర దోసకాయ వల్ల కంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోజ్ వాటర్ కళ్లకు కూడా మేలు చేస్తుంది. కంటి నొప్పి, చికాకు నుంచి బయటపడటానికి రోజ్ వాటర్ మీకు సహాయపడుతుంది. కళ్లల్లో 2 నుంచి 3 చుక్కల రోజ్ వాటర్ వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లలో దురద సమస్య కూడా అరికట్టవచ్చు.
కీర దోసకాయలాగే బంగాళదుంపలు కూడా కంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇందుకోసం ముందుగా బంగాళదుంప ముక్కలను కట్ చేసి 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీని తరువాత, చల్లని ముక్కలను కళ్ళపై ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..