ఏ దేశమేగినా.. భారతీయ మూలాలు మర్చిపోని ఉషా వాన్స్‌.. సంప్రదాయం ఉట్టిపడేలా..

ఇకపోతే, వీరి పర్యటనలో భాగంగా ఢిల్లీలో అధికారిక సమావేశాల తర్వాత, వాన్స్ కుటుంబం ఏప్రిల్ 22న జైపూర్, ఏప్రిల్ 23న ఆగ్రాలో పర్యటిస్తారని తెలిసింది. ఇప్పటికే తాజ్ మహల్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మరో వైపు ఉషా వాన్స్ స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. 

ఏ దేశమేగినా.. భారతీయ మూలాలు మర్చిపోని ఉషా వాన్స్‌.. సంప్రదాయం ఉట్టిపడేలా..
Us Vice President

Updated on: Apr 21, 2025 | 5:25 PM

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్, వారి పిల్లలతో కలిసి నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌లో అడుగుపెట్టారు. ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలో విమానం దిగిన వీరు భారత్‌ పట్ల తమకున్న అభిమానాన్ని, భారతీయ మూలాలను స్పష్టంగా కనిపించేలా వీరి రాక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మన దేశంలో అడుగుపెట్టిన ఉషా వాన్స్‌, వారి పిల్లలు ఇండియన్స్ అనిపించుకున్నారు. పిల్లలు ముగ్గురూ భారతీయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఉషా పాశ్చాత్య లుక్‌లో ఉన్నప్పటికీ అందమైన సాంప్రదాయ దుస్తుల్లో వారు విమానం దిగారు. ఇప్పుడు వారి ఫోటోలు ఇంటర్‌ నెట్‌లో వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు పెద్ద సంఖ్యలో జెడి వాన్స్‌ దంపతులను ప్రశంసిస్తున్నారు.

సోమవారం ఉదయం న్యూఢిల్లీలో దిగిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్‌ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా భారతదేశంలో అడుగుపెట్టిన వాన్స్‌ దంపతుల వస్త్ర ధారణ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేవీ బ్లూ కలర్‌ సూట్ ధరించి ఎర్రటి టై వేసుకున్నారు. ఉషా వాన్స్ రెడ్‌కలర్‌ లాంగ్‌ ఫ్రాక్‌పై వైట్‌ కలర్‌ బ్లేజర్‌లో కనిపించారు.

అయితే, ఇక్కడ మరింత స్పెషల్ అట్రాక్షన్‌ వారి పిల్లలే.. వాళ్ళ ముగ్గురు పిల్లలు భారతీయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అబ్బాయిలు ఇవాన్, వివేక్ నీలం, పసుపు రంగు కుర్తా పైజామా ధరించి ఉండగా, చిన్నారి మారిబెల్ నీలిరంగు అనార్కలి డ్రెస్‌లో చూడ ముచ్చటగా ఉన్నారు. సాంప్రదాయ భారతీయ దుస్తులలో విమానం దిగినప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపించారు. వారి తల్లి మూలాలను స్పష్టంగా చూపించారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వీరి పర్యటనలో భాగంగా ఢిల్లీలో అధికారిక సమావేశాల తర్వాత, వాన్స్ కుటుంబం ఏప్రిల్ 22న జైపూర్, ఏప్రిల్ 23న ఆగ్రాలో పర్యటిస్తారని తెలిసింది. ఇప్పటికే తాజ్ మహల్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మరో వైపు ఉషా వాన్స్ స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..