
ప్రతి ఒక్కరు తమ ముఖ చర్మం అందంగా, మెరిసేలా కనిపించాలని కోరుకుంటారు.? ఎందుకంటే..ముఖం అందంగా ఉంటే మనసు కూడా సంతోషంగా ఉంటుంది. నేటి బిజీ జీవితంలో మనం అందానికి చాలా సమయం ఇవ్వాలి. కానీ, చాలా మందికి వారి ముఖాన్ని ఎలా ప్రకాశవంతంగా ఉంచుకోవాలో తెలియదు.. ఖరీదైన క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు సీరమ్స్ అంటూ ఖర్చు పెడుతుంటారు. కానీ, మీ ముఖం చంద్రబింబంలా మెరిసిపోవాలంటే చేయాల్సింది ఇదే. ఖరీదైన క్రీములను ఉపయోగించే ముందు, ఆపిల్ లేదా ఆపిల్ తొక్కను ఉపయోగించి చూడండి..రిజల్ట్స్ మీరు ఊహించలేరు..
ఆపిల్ మీ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. మీ ముఖ కాంతికి కూడా అంతే మంచిది. ఎందుకంటే ఈ ఆపిల్ తొక్కలో అనేక పదార్థాలు ఉంటాయి. అవి మీ ముఖంలో కాంతిని పెంచుతాయి. చర్మం నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. అవి మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తాయి. అంతే కాదు, దీనిలోని సహజ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది క్రమంగా టానింగ్, పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.
చాలా మంది ఆపిల్‌ను తొక్క తీసి తింటుంటారు. కానీ, ఆ తొక్కను పారవేయకండి. దాంతో సహాజ ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆపిల్ తొక్కను ఎండలో బాగా ఆరబెట్టి పొడిగా రుబ్బుకోవాలి. ఈ పౌడర్‌కి రోజ్ వాటర్, తేనె వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీ ముఖానికి అప్లై చేసి, ఇరవై నిమిషాలు అలాగే ఉంచి కడిగేస్తే, మీ ముఖం స్మార్ట్ గా ఉంటుంది.
ఆపిల్స్ మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఆపిల్ తొక్కకు చర్మం ముడతలను నివారించే శక్తి ఉంది. ఇందులో విటమిన్లు సి, ఎ, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తుంది. చర్మ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడంతో, చర్మం మరింత తాజాగా, మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..