SBI Nominee Registration: ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్ లోనే నామినీ పేరు నమోదు చేసుకునే అవకాశం

|

Feb 07, 2021 | 7:37 AM

భారత దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రంగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు సేవలను మరింత అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఎస్‌బీఐ కస్టమర్స్ ఇక నుంచి ఇంట్లో  నామినీ పేరును..

SBI Nominee Registration: ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్ లోనే నామినీ పేరు నమోదు చేసుకునే అవకాశం
Follow us on

SBI Nominee Registration in Online: భారత దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రంగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు సేవలను మరింత అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఎస్‌బీఐ కస్టమర్స్ ఇక నుంచి ఇంట్లో  నామినీ పేరును జత చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది.

ఇక నుంచి ఎస్‌బీఐ వినియోగదారులు తమ నామినీ పేరును జత చేసుకోవాలన్నా.. మార్చుకోవాలనుకున్నా ప్రత్యేకంగా బ్యాంక్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. నామిని పేరును మూడు విధాలుగా జత చేసుకునే అవకాశం కల్పించింది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరు జత చేయవచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ఇన్ స్టాల్ చేసి అందులోకి లాగిన్ అయ్యి కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఇప్పుడు మీకు ఆన్‌లైన్ నామినీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన కస్టమర్ మరణం అనంతరం ఆ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులు. వినియోగదారుని ఖాతాలో ఉన్న నామినీకి ఆ డబ్బుపై పూర్తి అధికారం ఉంటుంది. అతనే ఆ డబ్బు మొత్తం చెందుతుంది.

Also Read:

వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ టెలిగ్రామ్‌కి బాగా కలిసొస్తుంది… ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయిన యాప్‌గా..

సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన షావోమి… దీంతో కేవలం పది నిమిషాల్లోనే..