Telegram: వాట్సాప్ ప్రైవసీ పాలసీ టెలిగ్రామ్‌కి బాగా కలిసొస్తుంది… ఎక్కువగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా..
elegram Most Downloaded App: ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశం పెద్ద రచ్చకే దారి తీసింది. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ప్రైవసీ పాలసీ వినియోగదారుల డేటా రక్షణను ప్రశ్నార్థకంగా మారుస్తుందంటూ...
Telegram Most Downloaded App: ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశం పెద్ద రచ్చకే దారి తీసింది. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ప్రైవసీ పాలసీ వినియోగదారుల డేటా రక్షణను ప్రశ్నార్థకంగా మారుస్తుందంటూ చర్చ జరిగింది. దీంతో యూజర్లు వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయడం మొదలు పెట్టారు. బాగా డ్యామేజ్ కావడంతో స్పందించిన వాట్సాప్.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ తీసుకురావట్లేదని ప్రకటించింది. అయితే వాట్సాప్ ఎంతలా చెబుతున్నా వాటి అన్ ఇన్‌స్టాల్‌లు మాత్రం ఆగట్లేదు. దీంతో ఇతర చాటింగ్ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ రేసులో టెలిగ్రామ్ ముందు వరుసలో ఉంది. ఈ జనవరిలో ప్లేస్టోర్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా టెలిగ్రామ్ నిలవడం విశేషం. ఐస్టోర్‌లో టెలిగ్రామ్ యాప్ ప్రస్తుతం నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పటి వరకు టెలిగ్రామ్ డౌన్‌లోడ్స్ 63 మిలియన్లు దాటాయని సెన్సార్ టవర్ తన నివేదికలో తెలిపింది. గతేడాది జనవరితో పోలిస్తే టెలిగ్రామ్ డౌన్‌లోడ్‌లు ఈసారి 3.8 రెట్లు పెరిగాయి. ఇక టెలిగ్రామ్ మొత్తం డౌన్‌లోడ్స్‌లో 24 శాతం భారత్ నుంచే ఉండడం విశేషం.