
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి ఈ కింది పానీయాలు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని ఈ కాలంలో వెచ్చగా ఉంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఆ పానీయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
అల్లం, పసుపు శరీరాన్ని లోపలి నుంచి వేడి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటితో తయారు చేసిన పానియం జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ శీతాకాలంలో ఈ టీ తాగడం మంచిది.
పసుపు పాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జలుబు వల్ల కలిగే ఛాతీ నొప్పిని కూడా తగ్గిస్తుంది.
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి జీలకర్ర నీటిని తాగవచ్చు. జీలకర్ర నీటిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి తాగితే సరి.
శీతాకాలంలో మీ శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడానికి, శరీర బలాన్ని కాపాడుకోవడానికి బెల్లం, జీలకర్ర నీరు తాగవచ్చు. బెల్లం, జీలకర్ర నీళ్లు శరీర జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఈ సూప్‌లో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఎముకలు, కండరాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.