మంచు అంటేనే కరిగిపోవడం. ఎంత పెద్ద మంచు గడ్డ అయినా… సూర్యుడి తాపానికి నీళ్లుగా మారాల్సిందే. ఇక మంచుతో దేనినైనా నిర్మిస్తే ఉంటుందా.. కొంచెం ఎండ పడిన కరగడం ప్రారంభిస్తుంది. మంచుతో చిన్న చిన్న నిర్మాణాలు చేపడితేనే ఎండకు ఉండవు. కానీ ఇక్కడ మంచుతో ఏకంగా అద్భుతమైన హోటల్‌నే నిర్మించేశారు. ఇకా ఈ హోటల్ సాధారణ హోటల్స్ కు విభిన్నం. అదెంటంటే… ఆ హోటల్ ఎండకాలంలో కూడా కరగదంట. ఏ కాలంలో అయిన పర్యాటకులకు అతిథ్యానిస్తుంది ఈ హోటల్. ఇది ఉత్తర స్వీడన్‌లోని జకాస్ జర్వీ అనే గ్రామంలో ఉంది. సుమారు 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఎంతో ఆకర్శణీయంగా నిర్మించారు.
ఇందులో ఎన్నో అద్బుతమైన డీలాక్స్ సూట్లు కూడా ఉన్నాయి. ఈ హోటల్ మొత్తాన్ని స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించారు. ఇక దీని పైకప్పును 20 సెంటీమీటర్ల ఇన్సులేషన్‌తో నిర్మించడం వలన ఎండాకాలంలో కూడా కరగదు. దీని పేరు ‘ఐస్ హోటల్ 365’ అందుకు తగ్గట్టుగానే 365 రోజులు అక్కడకు వచ్చే పర్యాటకులు వసతి కల్పిస్తుంది ఈ హోటల్.
ఇందులో మొత్తం తొమ్మిది రకాల డీలక్స్ రూంలు మూడు పద్దతుల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో అత్యంత సౌకర్యవంతమైన బెడ్స్, టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే ఇందులో షేర్డ్ ఆవిరి, షవర్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర స్వీడన్ లో ఈ హోటల్ ఉంది. దీనిని స్వీడన్ లోని కిరుణ ఎయిర్ పోర్టు నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ప్రతి సంవత్సరం ఈ హోటల్ కు 50 నుంచి 60 వేల మంది వస్తుంటారు. ఇది 2016 నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంది.
Also Read:
ఆరోజున తులసి ఆకులను తెంపుతున్నారా ? అయితే జాగ్రత్త.. తుంచితే ఏమవుతుందో తెలుసా..
శివంగిలా మారిన స్కూల్ అమ్మాయి.. వేధించిన యువకుడిని నడిరోడ్డుపై చితకబాదింది.. వీడియో వైరల్..
మెగా ఫోన్ పట్టనున్న స్టార్ కమెడియన్.. సరికొత్త ప్రయోగానికి తెరలెపిన ప్రియదర్శి..