Automatic Roti Making Machine: గంటలో 4,000 రోటీలు చేసే ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మెషిన్ చూశారా..! వైరలవుతోన్న వీడియో

ఈ వైరల్ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. చాలా మంది ఆటోమేటిక్ రోటీ మెషీన్‌ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Automatic Roti Making Machine: గంటలో 4,000 రోటీలు చేసే ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మెషిన్ చూశారా..! వైరలవుతోన్న వీడియో
Automatic Roti Making Machine

Updated on: Jun 26, 2021 | 3:06 PM

Delhi Gurudwara: సిక్కు మతంలో ఉన్న ముఖ్యమైన విలువల్లో ఒకటి అవసరమైన వారికి సేవ చేయడం. గురుద్వారాకు వచ్చే ప్రతీ ఒక్కరిని భోజనం చేయకుండా వెళ్లనివ్వరు. అది వారి సంప్రదాయంగా వస్తోందని మత పెద్దలు పేర్కొంటున్నారు. ప్రతీ గురుద్వారాలో లంగర్ పేరుతో పెద్ద వంట గది ఉంటుంది. గురుద్వారాలో అంతర్భాగంగా వీటిని నిర్మిస్తారు. లంగర్ తో ప్రతిరోజు ఎంతోమందికి ఉచిత భోజనం అందిస్తారు. ఇక్కడ వండిన భోజనం తినేందుకు ఎలాంటి వారికైన స్వాగతం చెబుతారు. సిక్కు కమ్యూనిటీ వలంటీర్లు ఇందులో ప్రతిరోజు వంటలు చేస్తారు. ఇది వారి మతం పాటించే పురాతన పద్ధతుల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఆహారాన్ని ఎంతో పరిశుభ్రంగా వండుతారు. గురుద్వారాలో చాపలపై కూర్చొబెట్టి వండిన వంటలు వడ్డించడం వారి ఆచారంలో భాగంగా వస్తోంది.

లంగర్‌లో ప్రతిరోజూ వందలాది మందికి ఆహారం వండి అందిస్తారు. ఢిల్లీ లోని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటైన బంగ్లా సాహిబ్ గురుద్వారా.. ఎక్కువ మందికి ఆహారం అందించేందుకు యంత్రాలు ఉపయోగించడం మొదలు పెట్టింది. ఇందులో ఆటోమేటిక్ రోటీ తయారీ యంత్రం అత్యంత సాంకేతికతతో తయారుచేసింది. ఈ యంత్రం ఒక గంటలో 4,000 రొట్టెలను తయారు చేస్తోంది. ఈ యంత్రం మరో స్పెషల్ ఏంటంటే.. గ్యాస్, కరెంట్.. రెండింటితో నడవడమే.

ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి ఈ ఆటోమేటిక్ రోటీ మెషిన్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 20 నిమిషాల్లో 50 కిలోల పిండితో ఈజీగా రొట్టెలు  చేసేస్తుందని అందులో వెల్లడించారు. మాములుగా మనుషులు చేయాలంటే రెండు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అదికూడా చాలామంది సహాయం కావాల్సిఉంటుందని పేర్కొన్నారు. ఈ రోటీ యంత్రం పిండిని ముద్దలా కలపడమే కాదు, గుండ్రంగా రొట్టెలు కూడా చేస్తుందని వివరించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకపోతోంది. చాలా మంది ఆటోమేటిక్ రోటీ మెషీన్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు. సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Revenge: మాజీ ప్రియుడి బైక్‌కు నిప్పంటించిన మహిళ.. ఎందుకో తెలుసా..? షాకింగ్ వీడియో..

చిత్తూరు జిల్లాలో తుపాకులతో బెదిరించి ఆవుల దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో :Cows Robbery video.

బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.

Shocking Video: ఒక్క సెకన్ అటు ఇటు అయినా చిరుతకు ఆహారం అయ్యేవాడే!.. షాకింగ్ వీడియో మీకోసం..