World’s Slowest Train: పరుగులో నత్తతో పోటి పడే రైలు బండి.. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే ఏకైక ట్రైన్‌

|

Aug 25, 2024 | 1:03 PM

ఇండియన్‌ రైల్వేలు ఆసియాలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ రైల్వే నెట్‌వర్క్ అనేక రైల్వే ట్రాక్‌లను అనుసందానం చేస్తూ.. నిత్యం లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. కానీ భారతదేశంలోనే కాదు, చాలా దేశాల్లో రైలు మార్గాలు ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత భయానకమైన రైల్వే మార్గం ఒకటి ఉంది. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రైలు మార్గంలో నడుస్తుంది..

1 / 6
ఇండియన్‌ రైల్వేలు ఆసియాలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ రైల్వే నెట్‌వర్క్ అనేక రైల్వే ట్రాక్‌లను అనుసందానం చేస్తూ.. నిత్యం లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. కానీ భారతదేశంలోనే కాదు, చాలా దేశాల్లో రైలు మార్గాలు ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత భయానకమైన రైల్వే మార్గం ఒకటి ఉంది. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రైలు మార్గంలో నడుస్తుంది.

2 / 6
స్విట్జర్లాండ్‌లోని గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా పేరుగాంచింది. దీని వేగం గంటకు 24 మైళ్లు మాత్రమే. ఎందుకు ఈ రైలు అంత నెమ్మదిగా వెళుతుంది అనే ప్రశ్న మీ మదిలో తలెత్తి ఉండవచ్చు. ఎందుకంటే.. ఈ రైలు కొండపై నిర్మించిన 291 వంతెనలు, 91 సొరంగాలను దాటుకుంటూ వెళ్తుంది మరి.

3 / 6
గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ (Glacier Express) ఆల్పైన్ రైల్వే గుండా వెళుతుంది. ఈ రైలు జెర్మాట్ నుంచి సెయింట్ మోరిట్జ్ వెళ్లే మార్గంలో దాదాపు 91 సొరంగాలు, 291 వంతెనలు ఉంటాయి.

4 / 6
ప్రపంచంలోనే అత్యంత నెమ్మదైన రైలు ప్రయాణ మార్గంగా ఇది నిలిచిపోయింది. దీని ప్రయాణ సమయం 8 గంటలు. అయితే ఈ 8 గంటల్లో ఒక్క క్షణం కూడా రైలులోని ప్రయాణికులకు బోర్‌ కొట్టదు. ఎందుకంటే   ప్రయాణంలోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయనీయదు.

5 / 6
ఈ రైలు మంచుతో కప్పబడిన మార్గం గుండా, కొన్నిసార్లు కొండల గుండా, ఇంకొన్నిసార్లు పచ్చని పొలాల గుండా వెళుతుంది. ఈ విభిన్న సుందర దృశ్యాలు ప్రయాణాన్ని ఆహ్లాదభరితం చేస్తాయి.

6 / 6
గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ రోన్ గ్లేసియర్ నుండి రైన్ జార్జ్ వరకు నడుస్తుంది. దీనిని స్విట్జర్లాండ్ గ్రాండ్ కాన్యన్ అని కూడా పిలుస్తారు. ఈ రైలులో ఆహారం, పానీయాలతో సహా అన్ని సదుపాయాలు ఉంటాయి.