మే నెలలో హాలీడే టూర్స్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే సౌత్ ఇండియాలో ఉన్న ఈ అందమైన ప్రదేశాలకు వెళ్ళాల్సిందే..

|

Apr 18, 2021 | 7:48 PM

వేసవి కాలం.. భానుడి తాపాన్ని తగ్గించుకొని.. కాస్తా ఉల్లాసవంతమైన చల్లటి ప్రదేశాలకు వెళ్లిపోవాలనిపిస్తుంటుంది. అందుకే చాలా

మే నెలలో హాలీడే టూర్స్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే సౌత్ ఇండియాలో ఉన్న ఈ అందమైన ప్రదేశాలకు వెళ్ళాల్సిందే..
Tourist Places
Follow us on

వేసవి కాలం.. భానుడి తాపాన్ని తగ్గించుకొని.. కాస్తా ఉల్లాసవంతమైన చల్లటి ప్రదేశాలకు వెళ్లిపోవాలనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది ఎక్కువగా మే నెలలో టూర్స్ ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఎక్కడికి వెళ్లాలి.. ఏ ప్రదేశం అనుకూలమైనది అనే సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి. మే నెలలో సందర్శించడానికి వీలైనటువంటి కొన్ని అందమైన ప్రదేశాలు సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. మరీ అవి ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందామా.

1. కొడైకెనాల్.. తమిళనాడు.. తమిళనాడులో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కొడైకెనాల్ ఒకటి. ఇది సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ కృత్రిమ సరస్సులు, సహజ ఆకర్షణలు, అలాగే హనీమూన్ కోసం వచ్చేవారికి అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

2. వయనాడ్.. కల్పేట, కేరళ..
వయనాడ్ కేరళలోని అసాధారణమైన రుతుపవనాల పర్యాటక కేంద్రం. బండిపూర్, నాగరాహోల్, ముతంగ వంటి వన్యప్రాణుల అభయారణాలకు నిలయంగా ఉన్నాయి. ఈ ప్రాంతం బనసురా సాగర్ డ్యామ్, వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఫైన్ ఫారెస్ట్‏లకు నిలయంగా ఉంది.

3. చిక్క మంగళూరు, కర్ణాటక..
ముల్లయనగిరి కొండల పర్వత ప్రాంతంలో ఉన్న చిక్మగళూరు అనే చిన్న పట్టణాన్ని కర్ణాటక కాఫీ హౌస్ అని కూడా అంటారు. ఇక్కడ అందమైన ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, కుద్రేముఖ్, ముల్లయ్యయనగరి, మాడీయెరే, కొప్పా, కలసా, శ్రీంగేరి, బనానహూర్నూర్ ఉన్నాయి.

4. మున్నార్.. కేరళ..

ఈ ప్రాంతం.. వర్షాకాలంలో మంత్ర ముగ్దులను చేస్తుంది. అన్ని జలాశయాలు, జలపాతాలు, ఇతర జల వనరులు కేరళ వేడి వేసవిని తాకుతాయి. మున్నార్ వర్షాకాలలో మాయాజాలం, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తుంది.

Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..