Travel Tips: జేబులో రూ.30 వేలు ఉంటే చాలు.. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరినట్లే..!

Travel Tips: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో విదేశాలకు వెళ్లాలని కోరిక ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని

Travel Tips: జేబులో రూ.30 వేలు ఉంటే చాలు.. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరినట్లే..!
Travel Tips
Follow us

|

Updated on: May 19, 2022 | 5:49 PM

Travel Tips: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో విదేశాలకు వెళ్లాలని కోరిక ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ నేటి కాలంలో విదేశాలకు వెళ్లడం అంత కష్టమేమి కాదు. మీరు మీ కుటుంబంతో భారతదేశంలో ఏ ప్రదేశాన్నైనా సందర్శిస్తే కనీసం 20 నుంచి 30 వేల వరకు ఖర్చు చేస్తారు. ఇదే ధరలో మీరు విదేశాలలో సులభంగా తిరిగే అవకాశాలు ఉన్నాయి. భారతదేశానికి సమీపంలోని కొన్ని దేశాల్లో మీరు కేవలం 30 వేల రూపాయలు ఖర్చుతో సులభంగా తిరగవచ్చు. కాబట్టి మీకు విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటే తక్కువ బడ్జెట్‌లో సందర్శించే 5 దేశాల గురించి తెలుసుకుందాం.

1. భూటాన్

హిమాలయ కొండలతో కప్పబడిన భూటాన్ దక్షిణాసియాలో ఒక ముఖ్యమైన దేశం. ఈ దేశంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీకు కావాలంటే ఏదైనా టూర్ ఏజెన్సీ నుంచి ముందస్తుగా భూటాన్ పర్యటనను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్లేందుకు మీకు వీసా అవసరం లేదు. బాగ్డోగ్రా నుంచి రిటర్న్ ఫ్లైట్ వరకు మీకు 10 వేలు ఖర్చు అవుతుంది. ఇక్కడ బస చేయడానికి కూడా మీకు చౌకగా హోటల్స్ లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

2. నేపాల్

నేపాల్‌ భారతదేశానికి పొరుగు దేశం. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలు, మఠాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మీరు చాలా తక్కువ బడ్జెట్‌లో నేపాల్ పర్యటనను పూర్తి చేయవచ్చు. బస్సు, రైలు, విమానంలో నేపాల్ చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్లేందుకు వీసా కూడా అవసరం లేదు.

3. శ్రీలంక

శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉండే ఒక ద్వీపం. ఇది భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. అయితే ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక వెళ్లేందుకు చెన్నై, బెంగుళూరు లేదా ముంబయి నుంచి 10 నుంచి 16 వేల తిరుగు ప్రయాణ టికెట్‌తో వెళ్లి రావొచ్చు. ఇక్కడ మీరు చాలా తక్కువ ధరకి హోటళ్లని బుక్‌ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వెళ్లాలంటే వీసా కావాలి. దీని ఫీజు 2000 రూపాయలు ఉంటుంది.

4. థాయిలాండ్

థాయ్‌లాండ్‌ను హనీమూన్ ప్లేస్‌గా పిలుస్తారు. చాలా మంది జంటలు ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడతారు. న్యూ ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కి విమానంలో ప్రయాణిస్తారు. నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఇక్కడ మీరు అందమైన బీచ్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే ఇక్కడ విలాసవంతమైన జీవితం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి వెళ్లేందుకు వీసా రుసుము 2000 రూపాయలు. ఇక్కడికి వెళ్లాలంటే కొచ్చి, చెన్నై, ముంబై, ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణానికి 8 వేల నుంచి 14 వేల టికెట్‌తో వెళ్లి రావొచ్చు.

5. ఇండోనేషియా

ఇండోనేషియా ఒక ప్రసిద్ధ ద్వీపం. ఇది జంటలకు గొప్ప ప్రదేశం. మీరు కుటుంబంతో కలిసి ఇక్కడకు వెళ్లవచ్చు. ఇక్కడ సముద్ర తీరంలో నిర్మించిన చారిత్రక దేవాలయాలు, సంప్రదాయ సంగీతం, నృత్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీరు ఇండోనేషియాకు 30 రోజుల కంటే తక్కువ కాలం వెళుతున్నట్లయితే మీకు వీసా అవసరం లేదు. ఇక్కడ విమాన టిక్కెట్టు కోసం దాదాపు 15 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మీరు సుమారు రెండున్నర వేల ధరకు సులభంగా హోటల్స్‌ని బుక్‌ చేయవచ్చు.

మరిన్ని పర్యాటక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో