AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Tourism: అందమైన ప్రదేశాలే కాదు.. అద్భుతమైన వస్తువులకూ ఫేమస్.. కేరళ పర్యాటకంలో మనసు దోచుకునే సందర్భాలెన్నో..

భూలోక స్వర్గంగా పేరు గాంచిన కేరళలో (Kerala) సుందర దృశ్యాలెన్నో.. మనసుదోచుకునే ప్రకృతి సౌందర్యాలు అడుగడుగునా మరెన్నో. బ్యాక్ వాటర్స్, సహజమైన బీచ్‌లు, పచ్చదనం, ఆయుర్వేద వైద్యం, ఆర్కిటెక్చర్, సంస్కృతి...

Kerala Tourism: అందమైన ప్రదేశాలే కాదు.. అద్భుతమైన వస్తువులకూ ఫేమస్.. కేరళ పర్యాటకంలో మనసు దోచుకునే సందర్భాలెన్నో..
Kerala Tourism
Ganesh Mudavath
|

Updated on: Sep 14, 2022 | 11:08 AM

Share

భూలోక స్వర్గంగా పేరు గాంచిన కేరళలో (Kerala) సుందర దృశ్యాలెన్నో.. మనసుదోచుకునే ప్రకృతి సౌందర్యాలు అడుగడుగునా మరెన్నో. బ్యాక్ వాటర్స్, సహజమైన బీచ్‌లు, పచ్చదనం, ఆయుర్వేద వైద్యం, ఆర్కిటెక్చర్, సంస్కృతి ద్వారా పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. సందర్శనకు వెళ్లే వారికి కేరళ పర్యాటకం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని, అనుభవాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్థానికంగా లభించే వస్తువులు కూడా మీ మనసులను దోచేస్తాయి. హస్తకళలు, సాంప్రదాయ ఆభరణాలు పుష్కలంగా లభించే వీధులు పర్యాటక ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేరళ పర్యాటకానికి వెళ్లే వారు అక్కడి నుంచి కొన్ని వస్తువులను కచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని అరన్ముల గ్రామంలో స్పెషల్ గా తయారయ్యే అద్దం చాలా ఫేమస్. ఇది గాజుతో కాకుండా లోహంతో తయారవుతుంది. అద్దాలు జీవితంలోకి సంపద, అదృష్టం ఆకర్షిస్తాయని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి ఇక్కడ లభించే అద్దాలను కచ్చితంగా కొనుగోలు చేస్తారు.

నీలవిలక్కు అనే సాంప్రదాయ నూనె దీపాలను పర్యాటకులు తప్పకుండా కొంటుంటారు. సాధారణంగా ఇత్తడి లేదా కంచుతో తయారు చేయబడిన ఈ దీపాలు కేరళ ప్రకృతి దృశ్యంలో ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. ఈ భారీ దీపాలను సాధారణంగా ఇంటి వరండాకు వేలాడదీస్తారు. ఈ దీపాలను వెలిగించడం శుభప్రదమే కాకుండా ఇంటికి అదృష్టం కలిగిస్తుందని నమ్ముతుంటారు. కేరళ సంప్రదాయ నృత్యంలో కథాకళి అగ్ర స్థానంలో నిలుస్తుంది. ప్రదర్శన సమయంలో, నృత్యకారులు వివిధ పాత్రలను చిత్రీకరించే ఫైబర్‌లు, కృత్రిమ రాళ్లతో రూపొందించిన మాస్క్‌లు ధరిస్తారు. కేరళలోని అంగళ్లలో వివిధ భావోద్వేగాలతో కూడిన కథాకళి మాస్కులు లభిస్తాయి.

నెట్టూర్ పెట్టీ అనేది కేరళలోని కన్నూర్ జిల్లాలోని నెట్టూర్ ప్రాంతంలో ఉద్భవించిన సాంప్రదాయ నగల పెట్టె. ఈ అందమైన బాక్స్ లను రోజ్‌వుడ్ లేదా కంట్రీ చెక్కతో తయారు చేస్తారు. పై భాగం పిరమిడ్ పోలి ఉంటుంది. కేరళ అందమైన పెయింటింగ్‌లకు ప్రసిద్ధి. మ్యూరల్ పెయింటింగ్స్ గా పిలిచే ఇవి పురాతన దేవాలయాలు, రాజభవనాలలో, పురాణాలు, ఇతిహాసాలను వర్ణించే గోడలపై కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..