Arunachalam: గురుపౌర్ణమిన అరుణాచల గిరి ప్రదక్షిణ.. తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌..

|

Jul 14, 2024 | 5:20 PM

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలం వెళ్తుంటారు. ఇక తాజాగా ఈ నెల 21వ తేదీ గురుపౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఇందుకోసం మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది..

Arunachalam: గురుపౌర్ణమిన అరుణాచల గిరి ప్రదక్షిణ.. తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌..
Tgrtc
Follow us on

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలం వెళ్తుంటారు. ఇక తాజాగా ఈ నెల 21వ తేదీ గురుపౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది.

గురుపౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాకుండా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, సిరిసిల్ల, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, సిద్ధిపేటతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. ఈనెల 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ఖర్చు ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్ ఇలా సాగుతుంది..

* తొలిరోజు సాయంత్రం ఆయా ప్రదేశాల నుంచి ప్రయాణం మొదలవుతుంది.

* రెండో రోజు ఉయదం కాణిపాకం చేరుకుంటున్నారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత తిరువనమలైకి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు, అలాగే గిరి ప్రదిక్షిణ ఉంటుంది. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

* ఇక మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే వేలూరులోని గోల్డెన్‌ టెంపుల్‌కి వెళ్తారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరగు ప్రయాణం మొదలవుతుంది.

* నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర..

ఇక ధర విషయానికొస్తే మనం ఎక్కడి నుంచైతే బయలుదేరి వెళ్తామో ఆయా ప్రదేశాల ఆధారంగా చార్జీలను నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, బుకింగ్ చేసుకోవాలన్నా 9848540371 ఫోన్ నెంబర్‌ను లేదా అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..