సమ్మర్‌లో టూర్‌కి వెళ్లాలని ప్రతీ ఒక్కరూ ప్లాన్ చేస్తుంటారు. తమన స్థాయికి తగ్గట్లు ప్రాంతాలను చుట్టేసి రావాలనుకుంటారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఓ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి అరకుకు అతి తక్కువ ధరలో ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజులుగా సాగుతుంది. ప్రతీ గురువారం టూర్ షెడ్యూల్ ఉంటుంది. ఇంతకీ ఈ టూర్ ఎలా సాగుతుంది.? ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి లాంటి వివరాలు మీకోసం..
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీలో.. కైలాసగిరి, వైజాగ్ బీచ్, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహలు, అన్నవరం వంటి ప్రాంతాలను చూడొచ్చు. టూర్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంటుంది..
మొదటి రోజు: తొలి రోజు సాయంత్రం టూర్ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పర్యాటక భవన్ నుంచి, బషీర్‌బాగ్ నుంచి 6.30 గంటలకు బస్సు బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో భోజనం ఉంటుంది.
రెండో రోజు: మరునాడు ఉదయం 6 గంటలకు విశాఖపట్నంలోని ప్రైవేట్ హోటల్ చేరుకుంటారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత 10 గంటలకు కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్‌ల సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి హోటల్‌కు చేరుకున్న తర్వాత రాత్రి భోజనం ఉంటుంది. రాత్రి హోటల్‌లో బస చేయాలి.
మూడో రోజు: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అరకు టూర్ ఉంటుంది. అక్కడ ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రాగుహలు, ధింసా డ్యాన్స్ చూపిస్తారు. అదే రోజు సాయంత్రం సొంత ఖర్చుతో క్రూజ్ బోట్‌లో జర్నీఉంటుంది( ఒక్కొక్కరికి రూ.500). తర్వాత తిరిగి హోటల్ కి చేరుకుంటారు.
నాలుగో రోజు: నాలుగో రోజు ఉదయం అన్నవరం బయలు దేరాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ పయణమవ్వాల్సి ఉంటుంది.
ఐదో రోజు: టూర్‌లో చివరి రోజైనా ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
పెద్దలకు ఒక్కొక్కిరికి రూ. 6,999గా ఉంటుంది. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 5,599గా ఉంటుంది. ఈ ధరలోనే బస్సు టికెట్లు, హోటలు సదుపాయం ఉంటాయి. ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..