వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. తెలుగువారి కోసం తక్కువ ధరకే IRCTC అందిస్తోన్న ప్యాకేజీ

|

Apr 16, 2024 | 9:15 PM

తక్కువ ధరకే ఆధాత్మిక పర్యటన చేయాలని కోరుకుంటుంటే ఐఆర్‌సీటీసీ టూరిజం పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీలను తీసుకొస్తుంది. విజయవాడ నుంచి షిరిడీ యాత్రను చేయాలనుకునే  తెలుగు వారి కోసం తక్కువ ధరలోనే సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మూడు రోజుల పాటు సాగనుంది. సాయి సన్నిధి విజయవాడ పేరుతో రైల్వే శాఖ అందిస్తున్న ఈ షిర్డీ టూర్ లో నాలుగు రోజుల పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే https://www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాల గురించి తెలుసుకుందాం..

వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. తెలుగువారి కోసం తక్కువ ధరకే IRCTC అందిస్తోన్న ప్యాకేజీ
Irctc Shirdi Vijayawada Tour
Follow us on

వేసవి కాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి చాలా మంది వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి ఆసక్తిని చూపిస్తారు. కొంతమంది ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎంచుకుంటే.. మరికొందరు ప్రకృతి అందాలను వీక్షించాలని కోరుకుంటారు. అయితే తక్కువ ధరకే ఆధాత్మిక పర్యటన చేయాలని కోరుకుంటుంటే ఐఆర్‌సీటీసీ టూరిజం పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీలను తీసుకొస్తుంది. విజయవాడ నుంచి షిరిడీ యాత్రను చేయాలనుకునే  తెలుగు వారి కోసం తక్కువ ధరలోనే సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మూడు రోజుల పాటు సాగనుంది. సాయి సన్నిధి విజయవాడ పేరుతో రైల్వే శాఖ అందిస్తున్న ఈ షిర్డీ టూర్ లో నాలుగు రోజుల పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే https://www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాల గురించి తెలుసుకుందాం..

నాలుగు రోజుల పాటు సాగనున్న షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాలు:

విజయవాడ నుంచి షిర్డీ కి వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి సన్నిధి ఎక్స్ విజయవాడ (SAI SANNIDHI EX VIJAYAWADA) అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ టూర్ ఈ రోజు నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

ఇవి కూడా చదవండి

రైల్వే ప్రయాణం ద్వారా పర్యాటకులు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆయా తేదీల్లో అందుబాటులో ఉండనుంది.

ట్రైన్ విజయవాడ నుంచి ప్రారంభమైనా సరే ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్ లో కూడా ట్రైన్ ను ఎక్కవచ్చు.

ఏ రోజున ఎలా సాగనున్నదంటే..

ఈ టూర్ మొదటి రోజ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. మంగళ వారం రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express)ను ఎక్కాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ హాల్ట్ స్టేషన్ ను ఎక్కవచ్చు. ఈ ప్రయాణం అంతా రాత్రి మొత్తం సాగనుంది.

రెండో రోజు ఉదయం 06.15 గంటలకు షిర్డీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నాగర్‌సోల్ కు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి షిర్డీ చేరుకుంటారు. ఆ రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. సాయంత్రం ఇష్టమైనవారి షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి షిర్డీలోనే బస చేయాల్సి ఉంటుంది.

మూడో రోజు ఉదయం టిఫిన్ తిని శని శిగ్నాపూర్ కు వెళ్తారు. శనీశ్వరుడి దర్శనం చేసుకుని మళ్లీ తిరిగి షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకొని విజయవాడకు తిరిగి ప్రయాణం అవుతారు.

తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది

ప్యాకేజీ టికెట్ ధరల వివరాలు:

థర్డ్ కాల్స్ ఏసీ సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 16165

థర్డ్ కాల్స్ ఏసీ డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10045

థర్డ్ కాల్స్ ఏసీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 8440

స్లీపర్ క్లాస్ లో లేదా స్టాండర్డ్ క్లాస్ టికెట్ ధరలు

ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 5985

డబుల్ షేరింగ్ టికెట్ ధర రూ. 7590గా

సింగిల్ షేరింగ్ టికెట్ ధర రూ. 13705

5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు ప్యాకేజీలో వేర్వేరు ధరలు ఉన్నాయి.

ఎవరైనా తెలుగు వారు షిర్డీ సాయినాధుడిని దర్శించుకోవాలనుకుంటే తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ టూరిజం శాఖ అందిస్తోన్న ఈ ప్యాకేజీ మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే 040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..