Magical Meghalaya Package : వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే IRCTC బంపర్ ఆఫర్ అందిస్తోంది.. వివరాలు తెలుసుకోండి..

|

Mar 28, 2021 | 12:36 PM

Magical Meghalaya Package : వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా అయితే IRCTC (Indian Railway Catering and Tourism Corporation) బంపర్ ఆఫర్‌ను

Magical  Meghalaya Package : వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే IRCTC బంపర్ ఆఫర్ అందిస్తోంది.. వివరాలు తెలుసుకోండి..
Irctc
Follow us on

Magical Meghalaya Package: వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా అయితే IRCTC (Indian Railway Catering and Tourism Corporation) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ధరలో విశాఖపట్నం నుంచి మేఘాలయకు వెళ్లి అక్కడి అందాలను వీక్షించి రావొచ్చు. అంతేకాకుండా హనీమూన్‌కి వెళ్లే వారికి ఇది సువర్ణావకాశం.. మ్యాజిక్ మేఘాలయ పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీ అధ్భుతంగా ఉంటుంది. ఆరు రోజుల పాటు ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరవచ్చు. టూర్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ప్యాకేజీలో పర్యాటకులు మేఘాలయతో పాటు అస్సాంలోని ప్రకృతి అందాలను వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీలో గువాహతి, షిల్లాంగ్, చిరపుంజ్, మావ్లిన్‌నాంగ్, కాజీరంగా లాంటి ప్రాంతాలను చుట్టి రావొచ్చు. మ్యాజికల్ మేఘాలయ టూర్ 2021 ఏప్రిల్ 24న మొదలవుతుంది. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.28,059. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.30,099 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.36,199 నిర్ణయించారు. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవచ్చు.

ఇదే వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేయాలి. హనీమూన్ వెళ్లాలనుకునే కపుల్స్‌కి లేదా ఫ్యామిలీ టూర్ వెళ్లాలనుకునేవారికి ఇది మంచి ప్యాకేజ్. ఆరు రోజుల టూర్ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం.. మొదటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 11.50 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు కోల్‌కతాలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 5.30 గంటలకు గువాహతి చేరుకుంటారు. అక్కడ్నుంచి షిల్లాంగ్ బయల్దేరాలి.

రెండో రోజు ఉదయం చిరపుంజి బయల్దేరాలి. నోహ్‌కలికై ఫాల్స్, మావ్‌స్మాయ్ గుహలు వీక్షించొచ్చు. దారిలో ఎలిఫాంటా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం మావ్లిన్‌నాంగ్ బయల్దేరాలి. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం అది. లివింగ్ రూట్ బ్రిడ్జ్, దావ్కీ సరస్సు చూడొచ్చు. నాలుగో రోజు ఉదయం డాన్ బోస్కో మ్యూజియం, యూమియం సరస్సు సందర్శించాలి. ఆ తర్వాత కాజీరంగా బయల్దేరాలి. ఐదో రోజు సెంట్రల్ రేంజ్‌లో జీప్ సఫారీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత గువాహతి బయల్దేరాలి. బాలాజీ ఆలయాన్ని సందర్శించొచ్చు. ఆరో రోజు ఉదయం కామాఖ్య ఆలయాన్ని సందర్శించొచ్చు. అక్కడి నుంచి గువాహతి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. సాయంత్రం 5 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.15 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు. రాత్రి 7.50 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు ఇవి టూర్ విశేషాలు..

Overthinking Habits : మీరు అతిగా ఆలోచిస్తారా..? అయితే ఈ సమస్యల భారిన పడ్డట్లే..! ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి..

Holi Festival Special : హోలీ రోజున అక్కడ ఆనందోత్సవాలతో పిడిగుద్దులాట జరుపుకుంటారు.