భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దేశంలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాలకు, వివిధ పర్యాటక ప్రాంతాలకు స్పెషల్ టూర్ ప్యాకేజీలను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో IRCTC టూరిజం శాఖ తెలుగువారికోసం హిందువుల పవిత్ర క్షేత్రం… పురాతన నగరం వారణాసికి వెళ్లాలనుకునే వారికి సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని జై కాశీ విశ్వనాథ్ గంగే పేరుతో అందిస్తోంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజులు తక్కువ ధరతో ఈ ప్యాకేజీని అందిస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రారంభయ్యే ఈ టూర్ ప్యాకేజీ.. కాశి విశ్వేశ్వరుడు దర్శనంతో పాటు సారనాథ్, ప్రయాగ వంటి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్యాకేజీ ధర వివరాల్లోకి వెళ్తే..
స్టాండర్డ్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,870
డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,750
కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,880
డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,760
ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో వసతి, ఏసీ వాహనంలో సందర్శన, అల్పాహారం, ప్రయాణ భీమా వర్తిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,000 కంటే తక్కువ. ప్రతి ఆదివారం జై కాశీ విశ్వనాథ్ గంగే టూర్ ని రైల్వే శాఖ అందిస్తోంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..