IRCTC Tourism: తక్కువ ధరకే వేసవిలో పూరి నుంచి కాశీ అయోధ్య వరకూ చుట్టేయండి.. పుణ్య క్షేత్ర యాత్ర డీటైల్స్ మీకోసం

|

Apr 25, 2023 | 12:28 PM

పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ను అందిస్తోంది. ఈ టూర్ లో భాగంగా వారణాసి, అయోధ్య, ప్రయాగ , పూరి, కోణార్క్ టెంపుల్ వంటి క్షేత్రాలను సందర్శించవచ్చు. మే 27 నుంచి ప్రారంభమైన ఈ టూర్ ప్యాకేజీ జూన్ 4వ తేదీన ముగియనుంది.

IRCTC Tourism: తక్కువ ధరకే వేసవిలో పూరి నుంచి కాశీ అయోధ్య వరకూ చుట్టేయండి.. పుణ్య క్షేత్ర యాత్ర డీటైల్స్ మీకోసం
Irctc Tourism
Follow us on

వేసవి సెలవులు వస్తే చాలు ఓ వైపు పిల్లలకు ఆటవిడుపు అయితే.. పెద్దలు తమ కుటుంబంతో ఎక్కడికైనా సరదాగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వినోదాన్ని ఇచ్చే పర్యాటక కేంద్రం లేదా.. పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. ఎక్కువ సెలవులు రావడంతో తమ కుటుంబంతో దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇదే అనువైన సమయం అని భావించే వారికీ ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కాశి, అయోధ్య, పూరి వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజ్ ని తీసుకువచ్చింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించడంతో తక్కువ ధరలోనే తొమ్మిది రోజుల పాటు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ డీటైల్స్ మీ కోసం

పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ను అందిస్తోంది. ఈ టూర్ లో భాగంగా వారణాసి, అయోధ్య, ప్రయాగ , పూరి, కోణార్క్ టెంపుల్ వంటి క్షేత్రాలను సందర్శించవచ్చు. మే 27 నుంచి ప్రారంభమైన ఈ టూర్ ప్యాకేజీ జూన్ 4వ తేదీన ముగియనుంది. ఈ టూర్ 9 రోజుల పాటు మూడు కేటగిరిల రూపంలో సాగనుంది. ఈ టూర్ లో తెలుగు రాష్ట్రాలోని విజయనగరం, పెందుర్తి, సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్ నుంచి వెళ్ళవచ్చు.

టికెట్ ధరలు: 

ఇవి కూడా చదవండి

కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీగా చార్జీలను నిర్ణయించింది. మీకు అందుబాటులో ఉన్న ధరలను ఎంపిక చేసుకోవచ్చు.

కంఫర్ట్ కేటగిరి అంటే సెకండ్ ఏసీలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ధర రూ. 31,435 నుంచి ప్రారంభమవుతోంది. డబుల్, ట్రిపుల్ షేరింగ్ లకు కూడా ఈ ధర వర్తిస్తుంది.

5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకు టికెట్ ధర రూ. 30,015 నిర్ణయించారు.

స్టాండర్డ్ కేటగిరి అంటే థర్డ్ ఏసీ లో ప్రయాణం ఉంటుంది. ఇందులో డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 23,995

5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ. 23,815

ఎకానమీ కేటగిరి అంటే స్లీపర్ క్లాస్‌లో జర్నీ ఉంటుంది. ఇందులో టికెట్ డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 15,120.

5 నుంచి 11 సంవత్సరాల్లోపు చిన్నారులకు రూ. 14,115

ఈ కేటగిరీల్లో ఎవరికీ నచ్చిన అందుబాటులో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

జర్నీలో కల్పించే సదుపాయాలు: 

పర్యటన సమయంలో ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి అందిస్తోంది.

ఏయే ప్రాంతాలను సందర్శించవచ్చు అంటే 

పర్యటనలో భాగంగా ఓడిశాలోని పూరీ జగన్నాథుడు, కోణార్క్ సూర్య దేవాలయం, బీచ్, విష్ణు గయ, కాశీ విశ్వనాథ్, గంగా హారతి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి పుణ్యక్షేత్రాలను, ఆ ప్రాంతాల్లోని ఆలయాలను  సందర్శించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..