IRCTC Ooty Tour: వేసవి వినోదం కోసం ఊటీ వెళ్ళాలనుకుంటున్నారా.. భాగ్యనగర వాసులకు IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే..

వేసవి వచ్చేసింది. మరోవైపు స్కూల్స్ తమ స్టూడెంట్స్ కు వేసవి సెలవులు కూడా ఇచ్చే సమయం వచ్చేసింది. దీంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఎక్కడికైనా చల్లని అయిన ప్రదేశంలో విహరించాలని.. సంతోషంగా గడపాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ వారు తెలుగు పర్యాటకుల కోసం సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. పచ్చని ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఊటీలో విహరించేందుకు ఓ ప్యాకేజీని అందిస్తోంది. ఈ రోజు టూర్ ప్యాకేజీ డీటైల్స్ తెలుసుకుందాం..

IRCTC Ooty Tour: వేసవి వినోదం కోసం ఊటీ వెళ్ళాలనుకుంటున్నారా.. భాగ్యనగర వాసులకు IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే..
Ooty Tour From Hyderabad

Updated on: Mar 08, 2025 | 4:24 PM

మండే వేసవిలో సైతం చల్లదనాన్ని ఇచ్చే ప్రకృతి అందాలు ఊటీ సొంతం. అందమైన సరస్సు, ఎత్తైన కొండలలో ప్రయాణిస్తూ వేసవి సెలవులను అద్భుతంగా మార్చుకునే వీలు కల్పిస్తోంది ఐఆర్​సీటీసీ టూరిజం.
ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన ఉడక మండలం(ఊటీలో) పర్యటించాలనుకునే ప్రకృతి ప్రేమికుల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ జర్నీ తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాల మీదుగా సాగుతుంది. ఈ రోజు ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం..

అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ప్రతి మంగళవారం ప్రయాణీకులకు అందుబాటులో ఉంచుతుంది ఐఆర్​సీటీసీ టూరిజం. ఆరు పగళ్ళు, ఐదు రాత్రులు సాగే ఈ టూర్ హైదరాబాద్​ నుంచి మొదలయ్యే ఈ జర్నీ.. సికింద్రాబాద్‌, నల్గొండ, తెనాలి, గుంటూరు వంటి రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఆయా స్టేషన్ లో ఈ రైలుని ఎక్కవచ్చు. పర్యటన ముగిసిన అనంతరం ఎక్కిన స్టేషన్ లో దిగవచ్చు.

టూర్ షెడ్యుల్ వివరాలు:

  1. జర్నీలో ఫస్ట్ డే మధ్యాహ్నం 12.20 గం. శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణించాల్సి ఉంటుంది.
  2. సెకండ్ డే : రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ లో దిగుతారు. అక్కడ నుంచి ఊటీకి వెళ్తారు. ఊటీలో హోటల్‌లో చెకిన్​ అవుతారు. ఈ రోజు మధ్యాహ్నం ఊటీలోని అందాల సరస్సులను, బొటానికల్ గార్డెన్స్ ను సందర్శిస్తారు. తిరిగి బస చేసే హోటల్ కు చేరుకుంటారు.
  3. ఇవి కూడా చదవండి
  4. థర్డ్ డే: మూడో రోజు ఉదయం అల్పాహారం తిన్న తర్వాత దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా వాటర్​ఫాల్స్​ సందర్శించడానికి వెళ్తారు. ఈ రోజు మొత్తం ఊటీ అందాలను చూస్తూ ఎంజాయ్ చేసి రాత్రి మళ్ళీ బస చేయడానికి హోటల్ కి చేరుకొని భోజనం ముగించి రాత్రి మళ్లీ ఊటీలోనే స్టే చేయాలి.
  5. ఫోర్త్ డే: నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిని తర్వాత కూనూర్‌ పర్యటనకు వెళ్తారు. మళ్ళీ ఊటీకి చెరుకుని రాత్రి ఊటీలోనే బస చేయాలి.
  6. ఫిఫ్త్ డే: ఉదయం అల్పాహారం తిని తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. ఊటీ నుంచి కోయంబత్తూర్‌ పయనమవుతారు. కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) సాయంత్రం 03:55గం. ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా జర్నీ చేసి ఆరో రోజు ఆయా స్టేషన్స్ లో దిగాల్సి ఉంటుంది.
  7. చివరిగా ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ఊటీ ప్రయాణం పూర్తి అవుతుంది.

ప్యాకేజీ టికెట్స్ ధరల వివరాలు..

థర్డ్‌ ఏసీలో

  1. సింగిల్ – షేరింగ్​ రూ.29,800
  2. డబుల్ షేరింగ్‌ – రూ.16,870,
  3. ట్రిపుల్ షేరింగ్‌- రూ.15,530 చెల్లించాలి.
  4. ఇక 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ అయితే రూ.9,130
  5. విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,820 చెల్లించాలి ఉంటుంది.

స్లీపర్ బెర్త్ కు

  1. ఒకొక్కరికి – రూ.27,340,
  2. ఇద్దరికీ అయితే టికెట్ ధర – రూ.14,410,
  3. ముగ్గురుకి అయితే – రూ.13,070.
  4. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ రూ.6,680లు చెల్లించాల్సి ఉండగా.. విత్ అవుట్ బెడ్ కి రూ.6,370 చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు ఏమిటంటే..

  1. ఎందుకున్న ప్యాకేజీకి అనుగుణంగా ట్రావెల్​ కోసం వెహికల్​
  2. హోటల్ లో ఉచితంగా బస
  3. మూడు రోజుల పాటు ఉచితంగా అల్పాహారం

ప్రయాణ భీమా సదుపాయం

అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో అందిస్తున్న ఈ టూర్ ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.. జూన్​ 24 IRCTC ప్రకటించిన తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఎవరైనా బృందంగా వెళ్ళాలనుకుంటే టికెట్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ టూర్​కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా .. టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..