IRCTC: తిరుపతి నుంచి షిర్డీకి టూర్‌.. తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ ప్లాన్‌.

|

Nov 25, 2023 | 2:57 PM

మొత్తం రెండు రాత్రులు, మూడు రోజుల పాటు ఈ టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. రైలు మార్గంలో షిర్డీ చేరుకుంటారు. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్‌కూ టూర్‌ ప్యాకేజీలో కవర్ అవుతుంది. తిరుపతి నుంచి బయలుదేరే రైలు సికింద్రాబాద్‌ మీదుగా షిర్డీ చేరుకుంటుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC: తిరుపతి నుంచి షిర్డీకి టూర్‌.. తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ ప్లాన్‌.
Irctc Tour
Follow us on

రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య టూర్ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. తిరుపతి నుంచి షిర్డీ వరకు ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. సాయి సన్నిధి ఎక్స్‌-తిరుపతి పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రైలు ప్రయాణం మొదలవుతుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

మొత్తం రెండు రాత్రులు, మూడు రోజుల పాటు ఈ టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. రైలు మార్గంలో షిర్డీ చేరుకుంటారు. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్‌కూ టూర్‌ ప్యాకేజీలో కవర్ అవుతుంది. తిరుపతి నుంచి బయలుదేరే రైలు సికింద్రాబాద్‌ మీదుగా షిర్డీ చేరుకుంటుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* టూర్‌లో భాగంగా తొలి రోజు తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఉదయం 8.30 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. ట్రైన్‌ నెంబర్‌ 17417 రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.

* మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు నాగర్‌సోల్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి వాహనంలో షిర్డీకి చేరుకుంటారు. వెంటనే హోటల్‌లో చెనిక్‌ అవుతారు. అనంతరం ఫ్రెషప్‌ అయ్యాక షిర్డీ సాయి దర్శనం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత శనిశిగ్నాపూర్‌ వెళ్తారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి షిర్డీకి చేరుకుంటారు. సాయంత్రం హోటల్‌ నుంచి చెకట్‌ అయ్యి నాగర్‌ సోల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 10.10 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

* మూడో రోజు రాత్రి 10.10 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో టూర్‌ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర విషయానికొస్తే..

సాయి సన్నిధి ఎక్స్‌-తిరుపతి టూర్‌ ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్‌ ఆక్యూపెన్సీకి రూ. 13,450గా ఉండగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 9110, ట్రిపుల్‌ ఆక్యూపెన్సికీ రూ. 7730గా నిర్ణయించారు. స్టాండర్డ్‌ క్లాస్ విషయానికొస్తే.. సింగిల్‌ ఆక్యూపెన్సీకి రూ. 10,620, ట్రిపుల్‌ ఆక్యూపెన్సీకి రూ. 4910గా ఉంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు ధరలు వేరువేరుగా నిర్ణయించారు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..