
వేసవి రానే వచ్చేసింది. విద్యా సంస్థలు కూడా సెలవులను ప్రకటిస్తున్నాయి. దీంతో సమ్మర్ హాలీడేస్‌లో టూర్స్‌కి ప్లాన్ చేయడం సర్వసాధారణమైన విషయమే. ఇక భగ భగమండే ఎండల్లో కేరళలాంటి కూల్ ప్లేస్‌కి టూర్‌కి వెళ్తే ఆ మజాయే వేరుగా ఉంటుంది కదూ! అక్కడి ప్రకృతి రమణీయతను ఎంజాయ్ చేస్తూ వేడిని తరిమికొట్టొలని మీరూ ప్లాన్ చేస్తున్నారా.? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ మంచి టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల ప్లాన్ ఉంటుంది. మే 02 తేదీన ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ ట్రిప్‌లో మున్నార్, అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
* మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:20 గంటలకు రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్మీలో ఉంటారు.
* రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్ వెళ్తారు. అనంతరం అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం మున్నార్ టౌన్‌లో పర్యటన ఉంటుంది. రాత్రి మున్నార్‌లోనే భస చేస్తారు.
* ఇక మూడో రోజు ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్‌లను చూపిస్తారు. రాత్రి కూడా మున్నార్‌లోనే స్టే చేయాల్సి ఉంటుంది.
* నాలుగో రోజు అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
* ఐదవ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
* ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
సింగిల్ షేరింగ్ ధర రూ. 32230 కాగా, డబుల్ షేరింగ్ రూ. 18740గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..